ప్రసాదంగా బంగారం,వెండి,నోట్లకట్టలు పంచే ఆలయం..ఎక్కడుందో తెలుసా?

ఏదన్నా గుడికి వెళ్లాగే ప్రదక్షిణాలు చేసి,దేవుని మొక్కుకోగానే అందరూ చూపు మరలేది ప్రసాదం వైపే.ప్రసాదం చేతికి అందగానే కళ్లకద్దుకుని కడుపులో వేసేస్తాం.

 An Indian Temple That Gives Away Gold As Prasad-TeluguStop.com

ప్రసాదం అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది.లడ్డూ,పులిహోర.

ఇవికాక చక్కెరపొంగలి.కానీ బంగారం,వెండి,నోట్లకట్టలు ప్రసాదంగా ఎప్పుడన్నా తీసుకున్నారా?అలా ఇచ్చే గుడి ఉందని మీకు తెలుసా??జోక్ చేయకండి అంటారా.జోక్ కాదండీ నిజంగా నిజం.కావాలంటే చదవండి.

బంగారం,వెండిని ప్రసాదంగా ఇవ్వడం ఏంటి.ఇదెక్కడి వింత ఆచారం అనుకుంటున్నారా.వింతగా ఉన్నా ఆ గుడిలో అదే సంప్రదాయం.మధ్యప్రదేశ్ లోని రత్లాం అనే నగరంలో ఉన్న మహలక్ష్మి దేవాలయాన్ని సందర్శించిన భక్తులకు బంగారం, వెండి లతో పాటు నోట్ల కట్టలను కూడా ప్రసాదంగా ఇస్తుంటారు.

భక్తులందరికి ఇవి ప్రసాదాలుగా ఇవ్వడానికి ఆ గుళ్లో ఏమన్నా నిక్షేపాలున్నాయా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే.మరి ఎక్కడినుండి వస్తాయి అంటే భక్తులనుండే…భక్తుల నుండి వచ్చిన విలువైన కానుకలను ఆలయం వారు తీసేసుకోకుండా, తిరిగి భక్తులకే ప్రసాదంగా పంచిపెట్టడం ఆ ఆలయ ప్రత్యేకత.

మనం అక్షయతృతియగా పిలుచుకునే దంతేరాస్ పర్వదినం ముగిసిన మరుసటి రోజు నుండి బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులను దేవీ దర్శనం చేసుకున్న భక్తులందిరికీ ప్రసాదంగా పంచిపెడుతుంటారు.దంతెరాస్ పండుగను చేసుకుని మహలక్ష్మి దేవికి, చాలా మంది భక్తులు కిలోల చొప్పున బంగారం, వెండి కడ్డీలు, వేల కోట్ల రూపాయలు కానుకగా సమర్పిస్తారు భక్తులు.

అక్షయతృతియ మొదలుకొని దీపావళి పర్వదినం వరకూ ఈ ఆలయమంతా భక్తులతో కిక్కిరిసి ఉంటుంది.అలా వచ్చిన కానుకులను తిరిగి వేరే భక్తులకు పంచుతారంట.

ప్రసాదంగా తీసుకున్న ఈ వస్తువులను భక్తులు అలాగే తీసుకెళ్లి ఇంట్లో పూజ గదిలో ఉంచుతారంట.ఇలా చేయడం వల్ల సకల కష్టాలు తొలగి ధన సంపదలు ప్రాప్తిస్తాయని వారి నమ్మకం.ఆచారం వింటుంటేనే ఎంత బాగుంది కదా.ఇక చూస్తే ఇంకెంత బాగుంటుంది.మరింకెందుకు ఆలస్యం ఈ సారి మధ్యప్రదేశ్ వెళ్లినప్పుడు ఆతల్లిని దర్శించుకుని, ఆ ప్రసాదాన్ని అందుకోండి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube