'ఫ్రెండ్ ఇంటికే అలా వెళ్లరు.. శబరిమలకు ఎలా వెళ్తారు?' ...స్మ్రుతి ఇరానీ సంచలన కామెంట్స్.!

సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పుతో శబరిమలలో మహిళల ప్రవేశంని నిరసిస్తూ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి… పోలీసులు భద్రతను మరింత పెంచారు.పోలీసులు ఎక్కడిక్కడ తనిఖీలు చేసి.

మహిళలను వెనక్కు పంపిస్తున్నారు.మహిళలు ఆలయంలోకి ప్రవేశించకుండా భక్తులు ఆందోళనలు కొనసాగించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.అన్ని వయసుల మహిళలను ఆలయంలోకి అనుమతించడానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఇంకా వెల్లువెత్తుతున్నాయి.

అయితే ఈ వివాదంపై స్మృతి ఇరానీ సంచలన కామెంట్స్ చేసారు.‘ప్రతి ఒక్కరికీ ప్రార్ధించే హక్కు ఉంది.కానీ అపవిత్రం చేసే హక్కు లేదు.

Advertisement

’’ ముంబైలో ఇవాళ జరిగిన యంగ్ థింకర్స్ కాన్ఫరెన్స్‌లో స్మతి ఇరానీ మాట్లాడుతూ.‘‘ప్రస్తుతం నేను మంత్రి స్థానంలో ఉన్నందున సుప్రీంకోర్టు తీర్పుపై వ్యాఖ్యానించలేను.

అయితే నాకు ప్రార్థించే హక్కు ఉంది… కానీ అపవిత్రం చేసే హక్కు నాకు లేదని నేను నమ్ముతాను.ఆ తేడాని మనమంతా గమనించి, గౌరవించాలి.

రుతుక్రమంలో ఉన్నప్పుడు మనం కనీసం స్నేహితుల ఇళ్లకు వెళ్లేందుకైనా ఇష్టపడతామా? అలాంటప్పుడు దేవుని ఆలయానికి కూడా ఇదే వర్తిస్తుందని ఎందుకు ఆలోచించరు?’’ అని ప్రశ్నించారు.

ఓ ఆలయం వద్ద తనుకు ఎదురైన ఓ అనుభవాన్ని కేంద్రమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.‘‘మా పిల్లలు జోరాష్ట్రియన్లు.ఇద్దరూ అగ్ని దేవాలయానికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

నేను అప్పుడే పుట్టిన నా కుమారుడిని తీసుకుని అగ్నిదేవాలయానికి వెళితే… నన్ను బయటికి పంపించేశారు.అప్పుడు నా కుమారుడు లోపల ఉండగా, నేను రోడ్డు మీద నిలబడి ప్రార్థన చేశాను…’’ అని ఆమె గుర్తుచేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు