త్వరలోనే కొత్త పార్టీ...జనసేన ఊసెత్తని జేడీ..!

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అందరికి సుపరిచితమే ఎందుకంటే సీబీఐ జేడీగా ఎన్నో క్లిష్టతరమైన కేసులని ఆయన చేధించారు.నీతి , నిజాయితీకి మారుపేరు గల అధికారిగా ఎనలేని కీర్తిని సంపాదించుకున్నారు.

 Jd Laxminarayana Wants Bring New Party In Telugu States-TeluguStop.com

అయితే ఇంకా కొన్నేళ్ళ సర్వీసు ఉండగానే సేవ చేయాలనే కాంక్షతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజలకోసం ముఖ్యంగా రైతుల 13 జిల్లాలో ఉండే రైతుల సాధక భాదలు తెలుసుకున్నారు.ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తాను రాజకీయ ఆరంగేట్రం చేయాలని నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు.

తన ఆలోచనలకి అనుకుణంగా ఏ పార్టీ ముందుకు వచ్చినా సరే ఎలాంటి వ్యక్తులు సంస్థలు ముందుకు వచ్చినా సరే వారితో కలిసి పని చేస్తానని తెలిపారు.

సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా తెలుగు ప్రజలందరికీ సుపరిచితమైన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ అరంగేట్రంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.తాను ఏ పార్టీలో చేరాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని లక్ష్మీనారాయణ అన్నారు.ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.

కొత్త పార్టీ స్థాపించాలా? లేక వేరే పార్టీలో చేరాలా? అనే విషయంపై ఆలోచిస్తున్నానని తెలిపారు.అయితే దీనిపై నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందన్నారు.

ఇప్పటికయితే తనను ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ ఆహ్వానించాయని లక్ష్మీనారాయణ తనకు వచ్చిన ఆఫర్లను వెల్లడించారు.

ప్రస్తుతానికి తాను ఏపీకే పరిమితం అవుతానని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ బలంగా ఉన్నందున తగిన వ్యూహంతో ముందుకెళ్తానని చెప్పారు.అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే జనసేన పార్టీ గురించి కనీసం జేడీ మాట్లాడటక పోవడంతో అసలు ఆ పార్టీని జేడీ లెక్కలోకి తీసుకోవట్లేదని అర్థమవుతోంది అంటున్నారు విశ్లేషకులు.

ఆయన్ని ఎంతగానో అభిమానించే యువత , ఉద్యోగులు ఆయన కొత్త పార్టీ పెడితేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జేడీ త్వరలోనే ఈ సస్పెన్స్ కి తెర తీయనున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube