అమెరికాలో భారతీయుడిని అవమానించిన భారతీయులు..!!

సొంత ఊళ్ళో ఎలా కొట్టుకుని చచ్చినా బయటూరు వెళ్ళినప్పుడు కలిసి మెలిసి ఉండాలి అంటుంటారు పెద్దవాళ్ళు.

ఎందుకంటే మనిషికి మనిషి సాయం మనం ఊరు దాటి వెళ్ళినప్పుడు చాలా అవసరమని అనుభవం చెప్తుంది.

పల్లె నుంచీ పట్నం వెళితేనే సొంత ఊరి మనుషులు కనపడితే ఎంతో ఆప్యాయంగా పలకరించుకుంటాం కలిసి పోతాం అలాంటిది దేశం కాని దేశం వెళ్లి అక్కడ పరాయి దేశస్తుల మధ్య అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన సొంత దేశం వ్యక్తులే చిన్న చూపు చూస్తే అంతకు మించి దౌర్భాగ్యం మరొకటి ఉండదు.అసలు ఇంతటి ఉపోద్ఘాతము ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే.

అమెరికాలో దసరా నవరాత్రుల సందర్భంగా గుజరాతీలంతా కలిసి దాండియా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి గుజరాతీ అయిన 29 ఏళ్ల కరణ్ జానీ (ఖగోళ భౌతిక శాస్త్రవేత్తగా) తన స్నేహితురాలితో వెళ్ళాడు.ఆట ప్రారంభం అవుతున్న సమయంలో వరుసలో నిలుచున్న అతగాడి గుర్తింపుకార్డులో పేర్లు చదివారు.అందులో కరణ్ జానీగా ఉండటాన్ని చూసి.

హిందూ పేరుగా లేదన్న కారణంగా ఆయన్ను బయటకు వెళ్లిపోవాలని కోరారు.

Advertisement

అయితే పక్కనే అతడితో పాటు వచ్చిన ఆయన స్నేహితురాలు తన స్నేహితుడి ఇంటి పేరు మురుడేశ్వర్ అని.తాను కన్నడ-మరాఠీ సంతతి వ్యక్తినని ఎంత చెప్పినా వారిని దాండియాకు అనుమతించలేదు.బయటకు పంపేశారు.

ఈ ఘటనతో ఒళ్ళు మండిన కరణ్ సోషల్ మీడియాలో తనకి జరిగిన అవమానాన్ని పోస్ట్ చేశాడు సాటి గుజరాతీకి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఫైర్ అయ్యాడు.దాంతో ఇప్పుడు ఆ పోస్ట్ వైరల్ అయ్యి గుజరాత్ లో పెద్ద ప్రకంపనలు రేపుతోంది.నెటిజన్లు గుజరాతీలు సైతం కరణ్ కి మద్దతుగా కామెంట్స్ పెడుతూ నిర్వాహకులని దుమ్మత్తి పోస్తున్నారు.2 Attachments .

Advertisement

తాజా వార్తలు