బిగ్ బాస్ విన్నర్ 'కౌశల్' గురించి చాలా మందికి తెలియని 10 ఆసక్తికర విషయాలివే.!

బిగ్‌బాస్‌’ తెలుగు సీజన్‌ 2 ఆదివారం రాత్రితో ముగిసింది.బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న 17 మందిని గెలుచుకోవడం ముఖ్యం కాదు.

 10 Unknown Fact About Bigg Boss 2 Winner Kaushal1-TeluguStop.com

కోట్లాది మంది ప్రేక్షకుల మనసుల్ని దోచుకోవడమే ముఖ్యం అని నిరూపించారు కౌశల్.బిగ్ బాస్ సీజన్ 2 ఫైనల్‌లో కోట్ల ఓట్లను కొల్లగొట్టి విజేతగా నిలిచారు.

వెంకటేష్ చేతుల మీదుగా బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ టైటిల్ అందుకున్నారు.

కౌశల్ పేరుతో ఆర్మీలు పుట్టుకొచ్చాయి.కౌశల్ ఫ్యాన్స్ పేరుతో హోల్టింగ్‌లు వెలిశాయి.ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాకుండా చాలా మంది మహిళలు, పిల్లలు, పిల్లల తల్లులు కూడా కౌశల్ పేరుతో నిర్వహించిన 2కె రన్‌లో పాల్గొన్నారు.

స్టార్ హీరోలు కుళ్లుకునేలా కౌశల్ ఆర్మీ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి బిగ్ బాస్ నిర్వాహకులకు గట్టి సంకేతాలనే పంపింది.బిగ్ బాస్ అంటే కౌశల్.కౌశల్ అంటే బిగ్ బాస్ అని అనడంలో అతిశయోక్తి ఏం లేదు అనుకుంట.ఈ క్రమంలో కౌశల్ పర్సనల్ లైఫ్ గురించిన ఆసక్తికర విషయాలు చూద్దాం.

1.శ్రీరామ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాల్లో ఆయన నటించారని తెలుసు కానీ మరికొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం.

2.కౌశల్ తండ్రి నాటక రంగ కళాకారుడు.వీరి కుటుంబం వైజాగ్‌లోని సుజాతా నగర్‌లో ఉండేది.తర్వాత హైదరాబాద్‌కి వచ్చారు.కౌశల్ చిన్ననాటి నుంచి ఆయన నటన చూస్తూ పెరిగారు.

3.

స్కూళ్లో చదువుతున్న రోజుల నుంచి ఆయన తండ్రిలా నటుడు కావాలని తపించారు.

4.తొలుత మోడలింగ్‌లో అవకాశాలు అందుకున్న ఆయన అనంతరం నటుడిగా మారారు.

5.మారుతి కార్గో, విజయ్ టెక్స్‌టైల్స్ వంటి సంస్థ వాణిజ్య ప్రకటనలకు మోడల్‌గా పనిచేసిన ఆయన 200 పైగా యాడ్స్ లో చేసారు.కాగా మహేశ్ బాబు చిత్రం రాజకుమారుడితో వెండితెరపై కాలుమోపారు.

6.బుల్లితెర‌పై చాలా సిరియ‌ల్స్ లో కౌశల్ నటిస్తున్నారు.

7.‘లుక్స్’ పేరుతో మోడలింగ్ ఏజెన్సీని 1999లో ప్రారంభించారు కౌశల్.దక్షిణాదిలో ఇదే తొలి మోడలింగ్ ఏజెన్సీ అంటారాయన.

8.1999లో మిస్టర్ ఇండియా పోటీల్లో ఫైనల్ వరకు వెళ్లారు.ప్రతి రోజూ కనీసం ఒక గంటపాటు వ్యాయామం చేయనిదే ఆయన రోజు మొదలుకాదు.

9.బిగ్ బాస్ లో గెలుచుకున్న డబ్బు మొత్తం ఆయన కాన్సర్ బాధితులకు విరాళంగా ఇచ్చేసి తన ఔనత్యాన్ని చాటుకున్నారు.

తన తల్లి కేన్సర్ చనిపోయారు కనుక కేన్సర్ బాధితులకు ఈ నగదును ఉపయోగిస్తానని చెప్పారు

10.కౌశల్ నీలిమ జంటకు ఓ కొడుకు ఓ కూతురు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube