పార్టీ అధికారంలోకి రావాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సింది.నాయకుల మొహమాటాలకు తలొగ్గి మరో సారి అధికారానికి దూరం అయితే ఇక పార్టీ మనుగడే ప్రశ్నర్ధకం అవుతుంది.
ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఇది అందుకే అందరికి కస్టమైనా … నష్టమైనా పార్టీ కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తప్పడం లేదు అంటూ తనదైన బాణీలో నాయకులకు జగన్ హెచ్చరికలు ఇస్తున్నాడు.

విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో వంగవీటి రాధా వంటి నేతనే పక్కనపెట్టిన జగన్ పార్టీ కోసం ఎలాంటి వారికైనా ఈ పరిస్థితి తప్పదనే సంకేతాలు ఇచ్చాడు.ఈ పరిణామంతో … వైసీపీలో ఇప్పుడు అంతా సెట్ అయిందంటున్నారు.వచ్చే ఎన్నికలు జగన్ కు అత్యంత కీలకమైనవి.
ఈసారి అధికారంలోకి రాకుంటే కష్టాలు తప్పవు.అందుకోసం జగన్ శ్రమకోర్చి లాంగ్ మార్చ్ కు సిద్ధమయ్యారు.
గత పదకొండు నెలల నుంచి జగన్ పాదయాత్ర చేస్తూనే ఉన్నారు.ప్రజాసంకల్ప పాదయాత్రకు మంచి స్పందన రావడం, పార్టీ ప్రకటించిన నవరత్నాలు కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లడంతో ఈసారి గెలుపు ఖాయమని జగన్ భావిస్తున్నారు.
స్వచ్ఛందంగా తరలి వస్తున్న ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని భావించిన జగన్ ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు.
ఇటీవలే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన జగన్ ఆ మరుసటి రోజు నుంచే చర్యలకు దిగారు.
జగన్ మొండిగానే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు.వంగవీటి రాధాను పక్కనపెట్టడమంటనే సాహసోపతమైన చర్య అని చెప్పక తప్పదు.
వంగవీటి రంగాకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులున్నారు.ఆయన సామాజిక వర్గమే కాకుండా కొన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా రంగాకు వీరాభిమానులే.
అలాంటిది ఆయన తనయుడు రాధాను సెంట్రల్ నియోజకవర్గం నుంచి తప్పించేశారు.

ఈ నెల 17వ తేదీ నుంచి గడప గడపకూ వైసీపీ కార్యక్రమం ప్రారంభమయింది.జగన్ రావాలి.అన్న కావాలి నినాదంతో ప్రారంభమయిన ఈ కార్యక్రమాన్ని జగన్ సీరియస్ గా తీసుకున్నారు.
జగన్ పాదయాత్రతో పార్టీకి మైలేజ్ పెరగడంతో ఎక్కువ మంది నియోజకవర్గ ఇన్ ఛార్జులు ప్రజల్లోకి తిరగడం మానేశారు.ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు నివేదిక ద్వారా తెప్పించుకుంటున్న జగన్ ఎన్నికల సమయంలో ఇలాంటి పరిణామాలను అస్సలు ఉపేక్షించకూడదని డిసైడ్ అయ్యారు.
రాష్ట్రంలోని మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఇన్ ఛార్జులను మార్చే ఆలోచనలోజగన్ ఉన్నాడనే సమాచారంతో పార్టీ నాయకులు అలెర్ట్ అయిపోయారు.నిత్యం ప్రజల్లోనే ఉంటూ జగన్ దగ్గర అనుకూలత ఉండేలా చూసుకుంటున్నారు.
మొదట జగన్ తీసుకున్న నిర్ణయాలు విమర్శలపాలు అయినా ఆ ఎఫెక్ట్ తో పార్టీలో అంతా సెట్ అయినట్టు కనిపిస్తోంది.
.