బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 అతి త్వరలోనే పూర్తి కాబోతుంది.ఈ సారి ఆరంభం నుండి కూడా విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.
ఆ విమర్శలను ఎదుర్కొంటూనే బిగ్‌బాస్‌ను ముందుకు తీసుకు వెళ్తున్నారు.సెలబ్రెటీల విషయంలో ఆరంభంలోనే పెదవి విరిచిన ప్రేక్షకులు ఆ తర్వాత ఒక్కొ ఇంటి సభ్యుడిపై ఒక్కో విధంగా స్పందస్తూ వస్తున్నారు.
మొదట బిగ్‌బాస్‌కు గీతా మాధురి చాలా చాలా ప్లస్ అవుతుందని, ఆమె తప్పకుండా ఫైనల్ వరకు ఉంటుందని అంతా అనుకున్నారు.అంతా అనుకున్నట్లుగా ఫైనల్ వరకు ఆమె ఉండే అవకాశం కనిపిస్తుంది.
కాని ఆమెపై ప్రేక్షకుల్లో విమర్శలు తారా స్థాయిలో వస్తున్నాయి.
ఇక బిగ్ బాస్ రూల్స్ ప్రకారం పడుకోకుండా ఉండాలనే నిబంధన ఉండటంతో దాన్ని ఉల్లంఘించారంటూ కౌశల్.ఎప్పటిలాగే గీతా మాధురితో వాదనకు దిగారు.నిజానికి గీతా మాధురి, దీప్తిలు ఒకే మంచంపై ఒకర్నొకరు పట్టుకుని ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనే పాటను పాడుతూ మెల్లగా నిద్రలోకి జారుకున్నారు.
దీన్ని పాయింట్ చేస్తూ.నిద్రపోయి ఫ్రెష్‌గా వచ్చారు అనే అర్ధంలో కౌశల్ కామెంట్ చేయడంతో.గీతా మాధురి ఫైర్ అయ్యింది.
ఇక బిగ్ బాస్ చివరి అంకానికి చేరుకోవడంతో ఫినాలేకి డైరెక్ట్‌గా వెళ్లేందుకు అవకాశం కల్పించారు బిగ్ బాస్.‘టిక్కెట్ టు ఫినాలే’లో భాగంగా.గార్డెన్ ఏరియాలో ఒక కారు ఉంచి.
ఆ కారులో ముందుగా వెళ్లి కూర్చున ఐదుగురు కంటెస్టెంట్ 24 గంటలు పాటు ఆ కారు నుండి కాలు కింద పెట్టకుండా కూర్చోవాలని ఫైనల్‌గా ఆ ఐదుగురిలో ఎవరైతే కిందకి దిగకుండా ఉంటారో వాళ్ళకు ‘టిక్కెట్ టు ఫినాలే’ లభిస్తుందని.ఈ టిక్కెట్ లభించిన వాళ్లకి ఎలిమినేషన్ నుండి మినహాయింపు కల్పిస్తూ.
ఫినాలేకి వెళ్లే అవకాశం కల్పించారు.అయితే నిర్ణీత సమయానికి ఒకరు కంటే ఎక్కువ మంది ఆ కారులో ఉంటే ఎవరికీ ‘టిక్కెట్ టు ఫినాలే’ లభించదంటూ మెలిక పెట్టారు బిగ్ బాస్.
కారులో ఉన్న దీప్తిపై తనీష్, శ్యామలపై సమ్రాట్ బలప్రయోగం చేశారు.కారు నుంచి బయటకు తోయడానికి ఇద్దరు ప్రయత్నించారు.సామ్రాట్, తనీష్ చేష్టలు రోత పుట్టించాయి.వారిని దీప్తి, శ్యామల బలంగా ఎదురించడంతో వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి.కారులో కూర్చున్న తనీష్ అసభ్యంగా ప్రవర్తించాడు.పక్కన దీప్తి ఉందనే ధ్యాస లేకుండా దీప్తి పక్కనే మూత్రం పోశాడు.
ఇంటి సభ్యులందరూ ఈ తతంగాన్ని చూశారు.ఏమిటీ వింత ప్రవర్తన అంటూ మాట్లాడుకొన్నారు.
దీప్తి వెంట్రుకలు కింద నేలను తాకాయి.కావున ఆమె ఈ పోటికి అనర్హురాలు అని తనీష్ చేసిన వాదనను కౌశల్ తోసిపుచ్చాడు.కానీ తనీష్ మొండిగా వాదించడంతో కౌశల్ ఒప్పుకోలేదు.అంతలోనే బిగ్‌బాస్ స్పందిస్తూ కాలు కిందపెడితేనే అనర్హురాలు అవుతారు అని చెప్పడంతో తనీష్, సామ్రాట్‌కు తగిన బుద్ధి చెప్పినట్టయింది.