‘ఈసారి ఏషియాడ్ మెడల్ గెలవకుండా ఇంటికి రాను….’ అని వెళ్లేముందే తన తల్లితో చెప్పింది స్వప్నా బర్మన్.
చెప్పినట్టే స్వర్ణం సాధించింది.భరించలేని పంటి నొప్పి ,బుగ్గకి ప్లాస్టర్ తోనే బరిలోకి దిగింది స్వప్నా.
పథకం గెలవాలనే తన కల ముందు బాదలనేవి ఏవి నిలవలేదు.పుట్టినప్పటినుండి ఇప్పటివరకు కటిక దారిద్ర్యంలో బతికిన స్వప్నకు కష్టాలనేవి కొత్తకాదు.
అందుకే పట్టుదలగా బరిలోకి దిగింది.తల్లికి ఇచ్చిన మాట ప్రకారమే స్వర్ణంతో తిరిగి రానుంది.
అయితే స్వప్న ఈవెంట్ ను టివిలో చూసి భావేద్వోగానికి గురైన తన తల్లి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతుంది.ఎన్ని కష్టాలు పడి ఉంటే ఇప్పుడు ఆ తల్లి అంతలా కన్నీరు మున్నీరవుతుందో ,ఆ వీడియో చూస్తే మనకు అర్దం అవతుంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జల్పాయ్గురి పట్టణానికి దగ్గర్లో ఉన్న ఓ మారుమూల గ్రామంలో 1996లో జన్మించింది స్వప్నా బర్మన్.పుట్టుకతోనే ఆమె రెండు కాళ్లకి ఆరేసి వేళ్లున్నాయి.స్వప్నా అమ్మ బసానా ఓ టీ ఎస్టేట్‌లో కూలీగా పనిచేస్తుంది.ఆమె తండ్రి పంచానన్ ఓ రిక్షావాలా.ఐదేళ్ల క్రితం పంచానన్ గుండెపోటుతో మంచానపడ్డాడు.దాంతో కుటుంబ పోషణ భారంగా మారింది.
పూటకి ఇంత తినడానికి కూడా కష్టపడాల్సిన పరిస్థితి.అటువంటి దారిద్య్రంలోనూ ఆటను ఏనాడూ పక్కన పెట్టలేదు స్వప్నా బర్మన్.
‘రాహుల్ ద్రావిడ్ అథ్లెటిక్స్ మెంటర్షిప్ ప్రోగ్రాం’ ద్వారా శిక్షణ పొందింది స్వప్నా బర్మన్.అయితే మిగిలినవారితో పోలిస్తే స్వప్నా శిక్షణ పూర్తిగా భిన్నంగా ఉండేది.
ఎందుకంటే ఆమె కాళ్లకి ఆరేసి వేళ్లున్నాయి.దాంతో సాధారణ ఆటగాళ్లు వేసుకునే షూస్ వేసుకుంటే సరిగ్గా సరిపోవు.
అయినా తనకు కావల్సిన బూట్లను కొనుక్కోలేని దుస్థితి ఆమెది.దాంతో నొప్పిని భరిస్తూనే మామూలు బూట్లతోనే ప్రాక్టీస్ చేసేది స్వప్నా బర్మన్.
ఏషియాడ్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత … ‘నాకు ఎవ్వరైనా మంచి బూట్లు కొనిచ్చి ఉంటే, ఇంతకంటే బాగా ఆడేదాన్ని…’ అంటూ తన దారిద్య్రాన్ని, బాధను చెప్పుకుంది స్వప్నా బర్మన్.ఏషియాడ్‌లో స్వర్ణం సాధించడంతో తమ కష్టాలన్నీ తీరిపోతాయని సంబరంతో పండగ చేసుకున్నారు ఆమె కుటుంబీకులు.ఆసియా అథ్లెట్లిక్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన తర్వాత కూడా స్వప్నాకి సరైన బూట్లు కొనుక్కునేందుకు అవసరమైన ఆర్థిక ప్రోత్సాహం కూడా ఆమెకు లభించలేదు.రేకుల ఇంట్లో ఓ చిన్న డబ్బా టీవీలో స్వప్నా బర్మన్ ఆటను తిలకించింది ఆమె కుటుంబం… కూతరి విజయాన్ని టీవీలో చూసి ఉక్కిరిబిక్కిరై, భోరుమంటూ విలపించింది.
ఇంట్లోంచి బయటకెళ్లి దేవతకు అమ్మా.అమ్మాను సాష్టాంగ నమష్కారం చేసింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.