వెనకడుగు వేసిన మాజీ జేడీ..ముందుకు ఎలా వెళ్లబోతున్నాడు .

వాపుని చూసి బలుపు అనుకున్నాడో ఏమో తెలియదు కానీ , అందరూ అనుకున్న దానికంటే కాస్త ఎక్కువ ఊహించుకున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణకు ఇప్పుడిప్పుడే రాజకీయాలంటే ఏంటో బాగా తెలిసొస్తున్నట్టుంది.రాజకీయ పార్టీ పెట్టాలన్నా, రాజకీయాల్లో ఉండాలన్నా పైకి కనిపించే అంత రేంజ్ లో సులువుగా ఉండదని చాలా ఇబ్బందులు ఉంటాయని గ్రహించాడు.

 Jd Lakshmi Narayana Political Career In Trouble-TeluguStop.com

జగన్ అక్రమాస్తుల కేసులో విచారంధికారిగా ఏపీ కి వచ్చిన ఆయనను మీడియా , ప్రజలు ఒక రేంజ్ లో ఆకాశానికి ఎత్తేసారు.ఇక అప్పటి నుంచి ఆయన ఒక వీవీఐపీ అయిపోయాడు.

ప్రజల్లో తనకు ఈ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందని గ్రహించిన ఆయన ఆ ప్రభావంతో .పోలీసు ఉద్యోగంతో సరిపెట్టుకోలేకపోయారు.తన రేంజ్‌ ఇంకా పెద్దది అనుకుని ఏకంగా ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చారు.రాజకీయ పార్టీ పెడతారని ప్రచారం జరిగింది.లేదు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అని వార్తలు వచ్చాయి.కానీ అవేమి వాస్తవాలు కాదని ఆ తరువాత జనాలకు అర్ధం అయ్యింది.

ఈ నేపథ్యంతో రాష్ట్రంలో పర్యటించిన తర్వాత తన నిర్ణయం చెబుతానని లక్ష్మీనారాయణ పర్యటనలకు బయలుదేరారు.తొలిసారి పర్యటనప్పుడు లక్ష్మీనారాయణకు మీడియా కాసింత ప్రచారాన్ని బాగానే ఇచ్చింది.

కానీ ఆ తర్వాత ఫోకస్ తగ్గించింది.

ఇక ఆయన పర్యటనల్లో తెలుసుకున్న నిజం ఏంటి అంటే.? తనది పార్టీ పెట్టేంత స్థాయి కాదని, ఒక వేళా పార్టీ పెట్టినా ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీని నడిపే అంత రేంజ్ తనకు లేదని అర్ధం చేసుకున్నాడు.అందుకే మొత్తం మీద తాను రాజకీయ పార్టీ పెట్టడం లేదని బహిరంగంగానే చెప్పేసాడు.

ఈ మేరకు ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పల్లామల్లిలో పర్యటించిన ఆయన.పార్టీ పెట్టే ఆలోచన లేదని, రైతుల సంక్షేమం కోసం పనిచేసే రాజకీయ పార్టీతోనే తన ప్రయాణం ఉంటుందని చెప్పారు.మొత్తానికి లక్ష్మీనారాయణ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బాగానే అర్ధం చేసుకున్నాడు.ఇక ఆయన రాజకీయ ప్రయాణం ఏ పార్టీతో ఉండబోతోంది అనేది మాత్రం ఇంకా సస్పెన్సుగానే ఉంది.

గతంలో ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.ఆ తరువాత మళ్ళీ ఆ ఊసే లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube