ప్రస్తుతం ఎక్కడ చూసినా “బిగ్ బాస్” ఫీవర్ నడుస్తుంది.అందరు కౌశల్ ఆర్మీ గురించే మాట్లాడుకుంటున్నారు.
బిగ్ బాస్ లో ప్రతివారం ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే విషయం అందరికి తెలిసిందే.ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వారిలో సంజన, శ్యామల, నూతన నాయుడు, కిరీటి, తేజస్వి, భాను ఉన్నారు.
కానీ పోయిన వారమే హౌస్ లోకి శ్యామల, నూతన నాయుడు రీ ఎంట్రీ ఇచ్చారు.కామన్ మాన్ గా నూతన నాయుడు హౌస్ లోకి ఎంటర్ అయిన విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటె షో స్టార్ట్ అయినప్పుడు నూతన్ నాయుడు బిగ్ బాస్ హౌస్ లోకి రావటానికి బిగ్ బాస్ యాజమాన్యానికి 4 కోట్లు ఇచ్చాడని ప్రచారం సాగింది.అయితే రెండో వారంలో ఆయన ఎలిమినేట్ అవ్వడంతో ఈ వార్త నిజం కాదు అన్నారు చాలా మంది.ఇప్పుడు నూతన్ నాయుడు రీ ఎంట్రీ కోసం భారీగా ఖర్చు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక కౌశల్ ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఉన్నారో అర్ధం అయింది.
ఎప్పుడైతే బిగ్ బాస్ రీ ఎంట్రీ ప్రకటన వచ్చిందో అప్పటి నుండి భారీగా ప్రమోషన్ ప్రారంభించాడు.కౌశల్ ని ఆకాశానికి ఎత్తేస్తూ కౌశల్ ఆర్మీని ప్రసన్నం చేసుకోవటంలో సఫలమయ్యాడు.
అంతేకాక ఆవేశపూరితంగా ప్రసంగాలతో దాదాపుగా 100 వీడియోలను చేసి సోషల్ మీడియాలో ప్రమోట్ చేసాడు.ఈ సోషల్ మిడియా ప్రచారం కోసం నూతన్ నాయుడు దాదాపుగా 10 లక్షలు ఖర్చు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
నూతన్ నాయుడు రాజకీయంగా ఎదగాలనే ఆలోచనతోనే బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళాడు అంటున్నారు కొంతమంది.







