యాంగ్రీ యంగ్‌మన్ రాజశేఖర్ చాలా సంవత్సరాల తర్వాత ‘గరుడవేగ’ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్నాడు.ఆ చిత్రం తర్వాత ఇంకొన్నాళ్లు హీరోగానే కొనసాగాలనే నిర్ణయానికి వచ్చాడు.
ఒకవేళ గరుడవేగ ఫ్లాప్ అయ్యి ఉంటే విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాలని రాజశేఖర్ భావించాడు.కాని గరుడవేగ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ఊహించని కలెక్షన్స్ వచ్చిన నేపథ్యంలో హీరోగా రాజశేఖర్ మరిన్ని సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకుని మంచి కథ కోసం ఎదురు చూశారు.
ఎట్టకేలకు ‘అ!’ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడు.

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నారు.ప్రస్తుతం క్వీన్ రీమేక్‌ను పూర్తి చేసే పనిలో ప్రశాంత్ వర్మ త్వరలోనే రాజశేఖర్‌తో సినిమా మొదలు పెట్టబోతున్నాడు.ఈ చిత్రంకు హీరోయిన్‌గా కాజల్‌ను ప్రశాంత్ వర్మ అనుకున్నాడు.
కాని కాజల్ మాత్రం రాజశేఖర్‌తో నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు.చిన్న హీరోలతో వరుసగా చిత్రాలను చేస్తున్న ఈమె రాజశేఖర్‌కు పెద్దగా క్రేజ్ లేదని, ఆయనతో సినిమా చేయడం వల్ల తన క్రేజ్ తగ్గుతుందని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అందుకే కాజల్ ఈ ఆఫర్‌ను తిరష్కరించినట్లుగా సమాచారం అందుతుంది.
మొదట దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడిన సమయంలో నిర్మొహమాటంగా నో చెప్పిన కాజల్ ఆ తర్వాత జీవిత మాట్లాడటంతో తాను వేరే ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న కారణంగా మీ చిత్రంలో నటించలేను అంటూ చెప్పిందట.
బెల్లంకొండ శ్రీనివాస్ వంటి చిన్న హీరో చిత్రంలో నటిస్తున్న కాజల్ తమ సినిమాలో నో చెప్పడంతో జీవిత చాలా ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.కాజల్‌కు మంచి పారితోషికం ఆఫర్ చేసినా కూడా నో అన్నదంటూ సమాచారం అందుతుంది.

ప్రస్తుతం రాజశేఖర్ కోసం మరో హీరోయిన్‌ను వెదికే పనిలో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది.కాజల్ హీరోయిన్‌గా పలువురి సరసన నటించింది, కాని రాజశేఖర్‌తో మాత్రం నటించేందుకు నో చెప్పడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తున్న చిత్రంలో కాజల్ చాలా గ్లామర్‌గా కనిపించబోతుందని, దాంతో పాటు ముఖ్యమైన పాత్రను కూడా చేయబోతుందని తెలుస్తోంది.







