యువ హీరో నాని ఈమద్య కాలంలో వరుసగా సక్సెస్‌లతో దూసుకు పోతున్నాడు.దాదాపు రెండు సంవత్సరాలుగా నానికి సక్సెస్ లేదా మినిమం సక్సెస్ చిత్రాలే మినహా ఫ్లాప్ అనేదే లేదు.
దాంతో పలువురు దర్శకులు నాని వద్దకు వెళ్తున్నారు.నిర్మాతలు కూడా నాని డేట్స్ కోసం పోటీ పడుతున్నారు.
ఇటీవలే నాని హీరోగా ‘చిత్రలహరి’ అనే ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యింది.అయితే నాని వరుసగా చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల చిత్రలహరికి కాస్త సమయం కోరడం జరిగింది.
సదరు దర్శకుడు కొన్నాళ్లు ఎదురు చూసిన తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నుండి ఆఫర్ రావడంతో జంప్ అయినట్లుగా తెలుస్తోంది.

‘నేను శైలజ’ వంటి మంచి సక్సెస్ చిత్రాన్ని చేసిన కిషోర్ తిరుమల ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్‌తో సినిమాకు సిద్దం అవుతున్నాడు.ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈనెల చివర్లో లేదా వచ్చే నెల ఫస్ట్‌వీక్‌లో మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.నాని ఎంతో ఇష్టపడి తప్పకుండా చేయాలని భావించిన మూవీని తేజూ దక్కించుకున్నాడు.
నాని బిజీగా ఉండటం వల్ల ఆయన అనుమతితోనే దర్శకుడు ఈ చిత్రాన్ని తేజూతో చేస్తున్నాడు.నాని ఓకే చేసిన స్క్రిప్ట్ కనుక ఖచ్చితంగా తేజూకు సక్సెస్‌ను తెచ్చి పెడుతుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.
నాని నుండి లాగేసుకున్న చిత్రలహరితో తేజూ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
నాని నుండి ఇప్పటికే ‘చిత్రలహరి’ వెళ్లి పోయింది.
ఆ విషయాన్ని మర్చిపోతున్న సమయంలోనే నానికి మరో షాక్ తప్పలేదు.ఎంసీఏ చిత్రం సమయంలోనే నిర్మాత దిల్‌రాజు మరో ప్రాజెక్ట్‌కు నాని వద్ద డేట్లు కోరడం జరిగింది.
అయితే నాని అప్పుడు చాలా బిజీగా ఉండటంతో సినిమా అయితే చేద్దాం కాని డేట్లు ఇప్పట్లో ఇవ్వలేను అంటూ తేల్చి చెప్పాడు.నాని కోసం అంటూ ‘సభకు నమస్కారం’ అనే టైటిల్‌తో స్క్రిప్ట్‌ను సిద్దం చేయిస్తున్నాడు.
నానికి అయితే సూపర్బ్‌గా ఉంటుందని, ఖచ్చితంగా దీన్ని నానితో చేస్తాను అని దిల్‌రాజు తన సన్నిహితులతో చెప్పుకొచ్చాడు.

‘సభకు నమస్కారం’ చిత్రాన్ని నాని కోసం అనుకున్న దిల్‌రాజు ఇప్పుడు అల్లు అర్జున్ వద్దకు తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే రెడీ అయిన స్క్రిప్ట్ మరియు మొత్తం స్టోరీలైన్‌ను బన్నీ అండ్ టీంకు దిల్‌రాజు అప్పగించడం, వారి నుండి పాజిటివ్ రెస్పాన్స్ రావడం జరిగింది.ఆ వెంటనే అల్లు అర్జున్ కూడా స్టోరీ లైన్‌ను వినడం నచ్చడంతో ‘సభకు నమస్కారం’ పెట్టేందుకు సిద్దం అయ్యాడు.
భారీ అంచనాల నడుమ రూపొందిన ‘నా పేరు సూర్య’ చిత్రం ఫ్లాప్ అయిన కారణంగా అల్లు అర్జున్ చాలా అంటే చాలా జాగ్రత్తలు పడుతున్నాడు.విక్రమ్ కుమార్‌తో మూవీ అనుకున్నా కూడా అది కథ వర్కౌట్ కాకపోవడంతో సభకు నమస్కారంను నాని నుండి బన్నీ లాగేసుకున్నట్లుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.







