స్టార్ హీరోలు చెప్పినట్లుగా దర్శకులు నడుచుకుంటారు, హీరోలు ఎప్పుడు షూటింగ్ పెట్టుకోమంటే అప్పుడు దర్శకుడు పెట్టుకోవాల్సిందే.సదరు హీరో డేట్లకు అనుగుణంగా ఇతర నటీనటులను ప్లాన్ చేసుకోవాలి.
అయితే ఇది అందరు దర్శకుల విషయంలో మాత్రం కాదు.టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు ముగ్గురు దర్శకులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నారు.
ముఖ్యంగా జక్కన్న ఏం చెబితే అదే స్టార్ హీరోలైనా చేయాల్సిందే.రాజమౌళి ఎలా అంటే అలా, ఎప్పుడు అంటే అప్పుడు సిద్దంగా ఉండాల్సిందే.
ఇప్పుడు అదే తరహాలో కొరటాల శివ చెప్పినట్లుగా స్టార్ హీరోలు వింటున్నారు.

కేవలం నాలుగు సినిమాలే చేసినా కూడా భారీ బ్లాక్ బస్టర్స్‌ను దక్కించుకున్న కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో చేసేందుకు సిద్దం అవుతున్నాడు.‘భరత్ అనే నేను’ చిత్రం విడుదలై చాలా రోజులు అవుతుంది.ఇప్పటి వరకు స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్న దర్శకుడు కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని చిరంజీవితో మొదలు పెట్టేందుకు ముహూర్తం ఫిక్స్ చేశాడు.
అక్టోబర్ లేదా నవంబర్‌లో ఈ చిత్రాన్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్న దర్శకుడు కొరటాల శివ అదే విషయాన్ని చిరంజీవికి చెప్పడం, ఆయన ఓకే చెప్పేయడం జరిగింది.
మామూలుగా అయితే చిరంజీవి ప్రస్తుతం సైరా చిత్రాన్ని చేస్తున్నాడు కనుక, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆయన 152వ చిత్రం ప్రారంభం అవుతుందని అంతా అన్నారు.
కాని కొరటాల అప్పటి వరకు ఆగే పరిస్థితి లేదు.నవంబర్‌లో ఎట్టి పరిస్థితుల్లో సినిమాను షురూ చేయాల్సిందే అని, లేదంటే మరో హీరోను చూసుకుంటాను అంటూ చెబుతున్నాడు.
అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో చిరంజీవి సైరా పూర్తి కాకుండానే కొరటాల దర్శకత్వంలో సినిమాకు సిద్దం అవ్వాల్సి వచ్చింది.కొరటాల సంవత్సరంకు ఒక్కటి చొప్పున విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

ఒకవేళ్ల నవంబర్‌లో సినిమాను ప్రారంభించనట్లయితే ఖచ్చితంగా 2019లో తన సినిమా విడుదల అయ్యే అవకాశం ఉండదు.అందుకే కొరటాల శివ పట్టుబట్టి మరీ ఈ చిత్రాన్ని నవంబర్‌లో ప్రారంభించేలా చిరంజీవిని ఒప్పించాడు.కొరటాల అన్ని చిత్రాల్లో కూడా సామాజిక అంశాలను టచ్ చేస్తూ ఉంటాడు.ఇక చిరంజీవితో చేయబోతున్న చిత్రం కూడా చాలా సున్నితమైన అంశంతో కూడినదిగా చెబుతున్నారు.మరో వైపు సైరా చిత్రంను త్వరత్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.







