బిగ్‌బాస్‌లో ఇద్దరు రీ ఎంట్రీ.. శ్యామల ఓకే, నూతన్‌ నాయుడు ఎలా?

తెలుగు బిగ్‌బాస్‌లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి.గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందో లేదో తెలియదు కాని ఎలిమినేట్‌ అయిన ఇంటి సభ్యుల్లో ఒకరిని మళ్లీ ఇంట్లోకి పంపించేందుకు ఓటింగ్‌ నిర్వహించారు.

 Shyamala And Nutan Naidu Re Enter The House-TeluguStop.com

స్టార్‌ మా వారు చెబుతున్న వివరాల ప్రకారం దాదాపుగా 12 కోట్ల ఓట్లు పోల్‌ అయ్యాయి.ఎలిమినేట్‌ అయిన వారు మళ్లీ ఇంట్లోకి వెళ్లడం ఏంటీ, అసలు వీరికి ఓట్లు పడతాయా అంటూ అంతా ఆశ్చర్యంగా అడిగారు.

కాని ప్రేక్షకులు మాత్రం భారీ ఎత్తున రెస్పాండ్‌ అయినట్లుగా అనిపించింది.ప్రేక్షకులు తమ ఓట్ల ద్వారా శ్యామల మరియు నూతన్‌ నాయుడును ఇంట్లోకి పంపించినట్లుగా నాని ప్రకటించాడు.

వారం రోజులుగా జరుగుతున్న చర్చకు ఫుల్‌స్టాప్‌ పడ్డట్లయ్యింది.బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో ముగ్గురు సామాన్యులకు ఛాన్స్‌ దక్కింది.వారిలో సంజన అన్నె మరియు నూతన్‌ నాయుడులు మొదటి రెండు వారాల్లోనే బయటకు వెళ్లి పోయారు.అయితే వారికి కూడా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం బిగ్‌బాస్‌ కల్పించాడు.

తేజస్వి, శ్యామల వంటి సెలబ్రెటీలు ఉన్న సమయంలో ఆ సామాన్యులకు చాన్స్‌ ఉండక పోవచ్చు అని అంతా అనుకున్నారు.శ్యామల బిగ్‌బాస్‌లో ఉండాల్సిన వ్యక్తి అని ఎక్కువ మంది భావించారు.

తేజస్వి కూడా తప్పకుండా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కలిగిన సెలబ్రెటీ.కనుక వీరిద్దరిలో ఒకరు వెళ్తారని అంతా ఊహించారు.

కాని అనూహ్యంగా నూతన్‌ నాయుడు ఇంట్లోకి వెళ్లడం షాకింగ్‌గా అనిపించింది.

మొదటి సారి నూతన్‌ నాయుడు ఇంట్లోకి వెళ్లినప్పుడు నాలుగు కోట్ల రూపాయలను లంచంగా ఇచ్చి ఆయన ఈ షోలో ఛాన్స్‌ దక్కించుకున్నాడు అంటూ ప్రచారం జరిగింది.ఆ వార్తల్లో నిజం లేదని, తాను బిగ్‌బాస్‌ నిర్వాహకులకు ఒక బిస్కట్‌ ప్యాకెట్‌ ఇచ్చాను తప్ప అంతకు మించి ఏం ఇవ్వలేదు అంటూ చెప్పుకొచ్చాడు.తాజాగా మళ్లీ సామాన్యుడు నూతన్‌ నాయుడు ఇంట్లోకి వెళ్లడంతో కొందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఓటింగ్‌ పక్రియ జన్యూన్‌గా జరిగిందా, అసలు నూతన్‌ నాయుడును నిజంగానే జనాలు కోరుకున్నారా అంటూ ప్రస్తుతం కొందరు చర్చించుకుంటున్నారు.

కౌశల్‌కు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో భారీ క్రేజ్‌ దక్కింది.

ఇంటి సభ్యులు అంతా కూడా కార్నర్‌ చేసిన నేపథ్యంలో కౌశల్‌కు మద్దతుగా నిలిచేందుకు నూతన్‌ నాయుడు ఆయన అభిమానులు ఇంట్లోకి పంపించేందుకు భారీ ఎత్తున ఓట్లు వేసినట్లుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.కౌశల్‌ ఆర్మీ కారణంగానే నూతన్‌ నాయుడు రీ ఎంట్రీ జరిగిందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

అసు విషయం ఏంటీ అనేది ఆ బిగ్‌బాస్‌ నిర్వాహకులకు మాత్రమే తెలియాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube