టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువ, మలయాళి, ఉత్తరాది ముద్దుగుమ్మలు టాలీవుడ్‌ను ఏలేస్తున్నారు.ఒక్కరు ఇద్దరు తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‌గా వచ్చేందుకు ప్రయత్నించినా కూడా వారికి తెలుగు సినీ ప్రముఖులు ఛాన్స్‌లు ఇచ్చే పరిస్థితి లేదు.
తెలుగు హీరోయిన్స్ స్టార్ హీరోలతో నటించి చాలా సంవత్సరాలు అయ్యింది.తెలుగమ్మాయి అంజలి కాస్త ఛాన్స్‌లు దక్కించుకుంటున్నా కూడా ఆమె ఎక్కువగా మలయాళంపై ఫోకస్ చేసింది.
శ్రీదివ్య తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయినా కూడా తమిళంలోనే ఎక్కువగా ఈమె గుర్తింపు దక్కించుకుంది.ఇక తాజాగా తెలుగమ్మాయి ఈషా రెబ్బా తెలుగులో హీరోయిన్‌గా ప్రయత్నాలు చేస్తోంది.

తెలుగులో మెల్ల మెల్లగా అవకాశాలు దక్కించుకుంటున్న ఈమె ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటిస్తోంది.దాంతో పాటు మారుతి సమర్పిస్తున్న ‘బ్రాండ్ బాబు’ చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటించింది.ఈ రెండు చిత్రాలతో ఈమె హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.ఉత్తరాది అమ్మాయిల మాదిరిగానే ఈ అమ్మడు గ్లామర్ డోస్‌ను పెంచుతూ వస్తుంది.
అరవింద సమేత చిత్రంలో చాలా గ్లామర్‌గా ఈ అమ్మడు కనిపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

ఈషా రెబ్బా తాజాగా నాగశౌర్య హీరోగా తెరకెక్కబోతున్న ఒక చిత్రంలో కూడా ఎంపిక అయ్యింది.ఉత్తరాది అమ్మాయిలతో ఇప్పటి వరకు నటించిన నాగశౌర్య మొదటి సారి ఈమెతో నటించేందుకు సిద్దం అవుతున్నాడు.తెలుగులో తెలుగు అమ్మాయిలు ఈమద్య కాలంలో ఇంతగా సినిమాలు చేయడం ఇదే అని చెప్పుకోవచ్చు.
వచ్చిన వారు వచ్చినట్లుగానే వెళ్లి పోతున్నారు.కాని ఈషా మాత్రం మెల్ల మెల్లగా ఇండస్ట్రీలో పాతుకు పోతూ ఉంది.
తెలుగులో ఈమె నటించబోతున్న సినిమాలు సక్సెస్ అయితే మాత్రం స్టార్ హీరోల సినిమాల్లో కూడా ఈమెకు ఛాన్స్ దక్కే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.అయితే ఈషా ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకోవాలని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
వరుసగా సినిమాలు చేయడం కంటే మంచి పాత్రలు చేస్తే భవిష్యత్తు బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.తెలుగులో తెలుగమ్మాయి చాలా కాలం తర్వాత వరుసగా చిత్రాలు చేస్తోంది.
మరి ఇది ఎన్నాళ్లు సాగుతుందో చూడాలి.







