ఏపీ సీఎం చంద్రబాబు పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.అమరావతి పేరు చెప్పి రైతుల దగ్గర నుంచి సారవంతమైన భూములు సేకరించి ప్రభుత్వం వారిని మోసం చేసిందన్నారు.
ప్రభుత్వం అడ్డగోలుగా భూదోపిడి చేస్తూ పిచ్చిపిచ్చి వేశాలేస్తోందన్నారు.రాజధాని చంద్రబాబు సొంత రాజ్యం కాదని గుర్తుంచుకుంటే మంచిదని హెచ్చరించారు.
అసలు ఒక రాజధానికి ఎంత భూమి అవసరం? ఎన్నికల్లో మద్దతు ఇచ్చేటప్పుడు చంద్రబాబు గారు 18 వందల ఎకరాల భూమి చాలు, అటవీ భూమి ఉంది డీ నోటిఫై చేయించవచ్చు అన్నారు.అది కాస్తా రైతుల నుంచి భూములు తీసుకుంటూ- లక్ష ఎకరాలకు చేర్చారు.1970 లో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం 22 వేల ఎకరాలు తీసుకొంటే ఇప్పటికి 12 వేల ఎకరాలు వినియోగించి మిగిలినది నిరుపయోగం చేశారు.ఇప్పుడు లక్ష ఎకరాలు తీసుకొని ఎప్పటికి వినియోగిస్తారని ప్రశ్నించారు.

చంద్రబాబు రాజు కానేకాదన్నారు.చంద్రబాబు పిచ్చిపిచ్చి వేశాలేస్తే జనసేన నేతృత్వంలో తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు.లక్ష మంది రైతులతో చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తానని ప్రకటించారు.త్వరలోనే ఉప్పెనలాంటి ప్రజాపోరాటం చూస్తారని పవన్ కల్యాణ్ ప్రకటించారు.జనసేన పార్టీ ఆధ్వర్యంలో 2103 భూసేకరణ చట్ట పరిరక్షణ సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బాధ్యతాయుతమైన అభివృద్ధి ఎందుకు చేయరు? ఏం.పొగరా మీకు? ప్రశ్నించేవారు లేరా? అడిగేవారు లేరా? ఉన్నారు.! పిచ్చిపిచ్చిగా చేస్తే తోలు తీసేస్తారు.అనంతపురం నుంచి ఇచ్చాపురం దాకా రైతులు లక్షలాదిగా తరలి వచ్చి అమరావతిలో సీఎం ఇంటిముందు కూర్చుంటాం.రాజధానిని ఆపేస్తాం’ అని పవన్ హెచ్చరికలు చేశారు.
2013 భూ సేకరణ చట్టానికి తూట్లు పొడుస్తూ భూములు లాక్కొంటున్నారు.
పాలకులు ప్రజల్లో ధైర్యాన్ని చంపేస్తున్నారు.అలా ప్రశ్నించేవాళ్ళు ఎవరూ ఉండరు అని తమ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు.
ఇక్కడ చేసిన విధంగానే భూములు తీసుకోవడం ప్రతి చోటా చేస్తారు.ముఖ్యమంత్రి గారూ.
ఇదేమీ మీ సొంత రాజ్యం కాదు.ఇష్టానుసారం భూ దోపిడీ చేయడానికి.
ఒక రైతు సొంత భూమిలోకి వెళ్తే రౌడీ షీట్ తెరుస్తారా? అంటూ ప్రవీణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.







