సుకుమార్‌ను ఇలా బుట్టలో పడేసిన మైత్రి

టాలీవుడ్‌ టాప్‌ దర్శకుడు సుకుమార్‌తో మైత్రి మూవీస్‌ వారు వరుసగా చిత్రాలను నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి.రామ్‌ చరణ్‌ మరియు సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను రాబట్టింది.

 Sukumar Works With Mythri Movie Makers-TeluguStop.com

ఆ చిత్రంను మైత్రి మూవీస్‌ బ్యానర్‌లో నిర్మించిన విషయం తెల్సిందే.రంగస్థలం చిత్రం ఏకంగా 125 కోట్ల షేర్‌ను రాబట్టింది.50 కోట్ల లోపు బడ్జెట్‌తో రూపొందిన ఆ చిత్రం భారీ వసూళ్లను రాబట్టిన నేపథ్యంలో నిర్మాతలు దర్శకుడు సుకుమార్‌కు దాదాపు 10 కోట్ల అధిక పారితోషికం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

రంగస్థలం చిత్రం కోసం సుకుమార్‌కు 15 కోట్ల పారితోషికంను ముందుగా అనుకున్నారు.సినిమా షూటింగ్‌ సమయంలోనే మరో రెండు కోట్ల పారితోషికంను అదనంగా పెంచారు.సినిమా విడుదలై భారీ బ్లాక్‌ బస్టర్‌ను దక్కించుకున్న నేపథ్యంలో అనుకున్న పారితోషికంకు ఏకంగా పది కోట్లను అధనంగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

మొత్తంగా 27 కోట్ల పారితోషికంను ఈయన అందుకున్నట్లుగా తెలుస్తోంది.తాను అడగకముందే భారీ పారితోషికంను ఇచ్చినందుకు గాను మైత్రి బ్యానర్‌లో మరో సినిమాను చేసేందుకు సుకుమార్‌ ముందుకు వచ్చాడు.

మహేష్‌బాబు, సుకుమార్‌ల కాంబోలో తెరకెక్కబోతున్న చిత్రంను మైత్రి మూవీస్‌ వారు నిర్మించబోతున్నారు.భారీ ఎత్తున పారితోషికంను మైత్రి వారు ఇస్తున్న కారణంగానే మరో రెండు మూడు చిత్రాలను కూడా సుకుమార్‌ వారి బ్యానర్‌లోనే చేయాలని నిర్ణయించుకున్నాడు.

ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వరుసగా హారిక హాసిని బ్యానర్‌లో చిత్రాలు చేస్తున్న విషయం తెల్సిందే.నిర్మాత రాధాకృష్ణ భారీ పారితోషికం ఇస్తున్న కారణంగానే ఆయన నిర్మాణంలో త్రివిక్రమ్‌ వరుసగా చిత్రాలు చేస్తున్నాడు.

ఇప్పుడు అలాగే మైత్రి బ్యానర్‌లో సుకుమార్‌ వరుసగా చిత్రాలు చేసేందుకు కమిట్‌ అవుతూ వస్తున్నాడు.స్టార్‌ దర్శకులను తమ వలలో వేసుకుంటూ మైత్రి వారు పెద్ద చిత్రాలను నిర్మిస్తూ ముందుకు దూసుకు పోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube