బలంతో కాదు బలహీనతలతో బాబు స్కెచ్

రాజకీయ చాణిక్యుడిగా .పేరు పొందిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల విజయాన్ని అందుకోవడానికి తహతహలాడుతున్నాడు.

 Chandrababu Political Sketch In Ap Politics-TeluguStop.com

అందుకే ఇప్పటి నుంచే ఎన్నో ఎన్నెన్నో ఎత్తులు పై ఎత్తులు వేస్తూ టీడీపీ జెండా రెపరెపలాడించడానికి సిద్ధం అవుతున్నాడు.దీనిలో భాగంగానే టీడీపీ కి ఆగర్భ విరోధులైన పార్టీలతో కూడా కలిసేందుకు బాబు వెనకడుగు వెయ్యడంలేదు.

ఎందుకంటే అయన కు కావాల్సింది అంతిమంగా విజయం.రాబోయే ఎన్నికల్లో ముక్కోణపు పోటీ అనివార్యం అవ్వడంతో పాటు ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ టీడీపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లిన అనుభవం లేకపోవడంతో బాబు పొత్తు లకోసం పార్టీలను ఆశ్రయిస్తున్నాడు

ఇప్పటికే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు.కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అంతో ఇంతో ప్రభావం చూపించగలదని బాబు నమ్మకం.కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి.

ఆ పార్టీకి చంద్రబాబు నాయుడు పదిహేను సీట్ల వరకూ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు టీడీపీ వర్గాలు కొన్ని చెప్తున్నాయి.అది కనుక కుదరకపోతే… కాంగ్రెస్ పార్టీని ఓట్లు చీల్చేందుకు ఉపయోగించుకోవడం.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిన్న చిన్న నేతలకు ఊతం ఇచ్చి, వారి తరఫున ఎలక్షన్ ఖర్చులను కూడా చంద్రబాబు నాయుడే పెట్టుకునేలా ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.

దీంతో పాటు ఇప్పటికే ఏపీ లో ఉనికి కోసం ఆరాటపడుతున్న చిన్నాచితక పార్టీలను కూడా రంగంలోకి దించాలని భావిస్తున్నాడట.అందుకే వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీఎస్పీని కూడా బరిలో దింపాలని బాబు భావిస్తున్నట్టుగా సమాచారం.మాయవతికి చెందిన యూపీ పార్టీని ఏపీలో యాక్టివేట్ చేసి, ఆ పార్టీ తరఫున దళిత అభ్యర్థులు రంగంలోకి దించాలని బాబు అనుకుంటున్నాడట.వీరు ఆయా నియోజకవర్గాల్లో దళితుల ఓట్లను చీల్చుతారనేది బాబు ఆశ.ఎందుకంటే… సాధారణంగా దళితుల ఓట్లు వైసీపీకి పడే అవకాశాలున్నాయి.బీఎస్పీని రంగంలోకి దించితే.నియోజకవర్గానికి ఇది ఐదారు వందల ఓట్లను చీల్చినా అవి వైకాపా కు పడే ఓట్లే అవుతాయనేది చంద్రబాబు నాయుడి అంచనాగా తెలుస్తోంది.అయితే బాబు ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా అనేది మాత్రం సందేహమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube