ఎన్నికల్లో ఎలా గట్టెక్కాలిరా బాబు అని పార్టీలన్నీ ఒకటే హైరానా పడుతుంటే.ఇప్పుడు అన్ని పార్టీలకు పెద్ద షాకింగ్ న్యూస్ ఒకటి ఇంకా కలవరపెడుతోంది.
ఎన్నికల సంఘం చేసిన ఓ చిన్న పొరపాటు వల్ల మొత్తం అన్ని పార్టీలు భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి తలెత్తింది.ఇంతకీ విషయం ఏంటి అంటే.? రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో భారీగా ఓట్లు కోతకు గురయ్యాయి.ఇది ఎవరో కావాలని కుట్ర పన్ని చేసింది కాదు.
సాక్ష్యాత్తు ఎన్నికల సంఘం దగ్గర తలెత్తిన ఓ సాంకేతిక సమస్య కారణంగానే.అయితే ఆ సమస్యకు పరిష్కారం లభించకపోతే కనుక పరిస్థితి ఏంటి అని అన్ని పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.

గత ఎన్నికలతో పోల్చుకుంటే వచ్చే ఎన్నికలకు ఓట్ల సంఖ్య పెరగాలి.కానీ ఇప్పుడు అలా జరుగకపోగా ఉన్న ఓట్లు కూడా తగ్గిపోయాయి.ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ఇంకెన్ని లక్షల ఓట్లు మాయమైపోతాయో అని పార్టీల్లో ఆందోళన మొదలైంది.ఉదాహరణకు తీసుకుంటే, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 2014లో 2.65 లక్షల ఓట్లున్నాయట.తాజా ఓట్లు ఎంతంటే 1.7 లక్షలట.అదే విధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 70 వేల ఓట్లు, పెనమలూరులో 40 వేల ఓట్లు, విశాఖపట్నం దక్షిణంలో 55 వేల ఓట్లు, గుంటూరు 1లో 40 వేలు, కడపలో సుమారు 1.2 లక్షల ఓట్లు ఇలా.ఏ నియోజకవర్గంలో చూసినా సగటున వేలల్లో ఓట్లు మాయమైపోయాయి.

అధికార పార్టీ టీడీపీ నే తమ ఓట్లను గల్లంతు చేసేస్తున్నట్లు ఎప్పటి నుంచో వైసీపీ ఆరోపిస్తోంది.అయితే ప్రస్తుతం టీడీపీ ఎమ్యెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకర్గాల్లో కూడా వేలాది ఓట్లు మాయం అయ్యాయి.ఓట్ల గల్లంతుకు ఎన్నికల సంఘం అధికారుల నిర్వాకమే కారణంగా తెలుస్తోంది.ఓటరు కార్డుకు ఆధార్ కార్డును అనుసంధానం చేశారట.దాంతో ఆధార్ కార్డులో పేరు, ఓటరు కార్డులో పేరులో స్పెల్లింగ్ లో తేడా ఉండటంతో ఓట్లను తీసేశారట.అలాగే, ఎన్నికల సంఘం సర్వర్ కూడా మొరాయించటంతో వివరాలు దొరకటం లేదట.
ఆధార్ కార్డుకు ఓటరు కార్డుకు లింక్ పెట్టవద్దని సుప్రింకోర్టు చెప్పినా ఎన్నికల సంఘం వినటం లేదు.దాంతో జాబితా నుండి లక్షల్లో ఓటర్ల వివరాలు మాయమైపోయాయి.







