రోజా పువ్వు ఇస్తే అమ్మాయిలు లవ్ లో పడతారో లేదో తెలీదు కానీ…ప్రస్తుతం మాత్రం ఆ రోజా పువ్వు వల్ల భార్య భర్తల మధ్య వివాదం ఏర్పడింది.భర్తకు ఆ రోజా పువ్వు ఇచ్చింది ఓ ట్రాఫిక్ పోలీస్.
ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.వివరాల లోకి వెళ్తే.

ట్రాఫిక్ నిబంధనల గురించి వివరించడం.ముఖ్యంగా హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రచారానికి తెర తీసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో లక్నో ట్రాఫిక్ పోలీసులు.హెల్మెట్ ధరించి ద్విచక్రవాహనాలు నడుపుతున్న వారికి గులాబీ పూలు అందిస్తున్నారు.ఇందులో భాగంగా నగరంలోని సికందర్‌బాగ్ కూడలి వద్ద ఓ బైకర్‌కు రోజా అందించారు.

ఆ గులాబీ తీసుకొని ఆ వ్యక్తి నేరుగా అతడి ఇంటికెళ్ళాడు.ఇక అక్కడితో గొడవ మొదలయ్యింది.ఈ రోజా పువ్వు ఎక్కడిది అని ఆ భార్య భర్త గిర్రున ఎగసింది.
ట్రాఫిక్ పోలీసు ఇచ్చారని వివరిస్తే కట్టుకథ అని కొట్టిపారేసింది.దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తీవ్రమైన వాగ్వివాదానికి దారి తీసింది.
తన తప్పులేదని ఆ భర్త భార్యకు నిరూపించడానికి పెద్ద కష్టమే అయ్యింది.ఆ గులాబీ అందుకున్న జంక్షన్ కి వెళ్లారు.ట్రాఫిక్ పోలీస్ గురించి వెతికినా దొరకలేదు.ఇక నేరుగా పోలీస్ స్టేషన్ కె వెళ్లారు.
ట్రాఫిక్ ఎస్సైని కలిసి ఆ వ్యక్తి జరిగిన వివాదం గురించి చెప్పుకున్నాడు.దీంతో ఆయన తమ క్యాంపెయిన్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలను ఇచ్చి పంపించారు.
దీంతో సదరు వ్యక్తి ఆత్మవిశ్వాసంతో ఇంటిముఖం పట్టాడు.ఈ వింత ఘటన గురించి వివరిస్తూ ఆ ఎస్సై తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టడటంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ఇప్పుడు ఈ అంశం వైరల్ అయింది.







