మా అమ్మ చీరకొంగు...ఇప్పటి మమ్మీ లకు తెలీదు అంటూ వైరల్ అవుతున్న మెసేజ్.!

మొన్నొకసారి ఆటోలో వస్తుంటే ఇద్దరు తల్లిపిల్లలు ఎక్కారు.ఆ పిల్లాడు చలికి వణికిపోతున్నాడు ఇంతలో పక్కన కూర్చున మరొకామె నీ కొంగుని నీ మెడ మీది నుండి తీసుకుని నీకు కప్పుకుని ,బిడ్డ ఒళ్లో కూర్చో బెట్టుకుని బిడ్డకి కప్పమ్మా వెచ్చగా ఉంటుంది అంది.

 Ma Amma Cheera Kongu Viral Message Motherlove-TeluguStop.com

ఆ అమ్మ అలాగే చేసింది బిడ్డ తల్లి కొంగులో వెచ్చగా నిద్రపోయాడు.భలే అనిపించింది.

నిజంగా అమ్మకొంగు మాధుర్యమే వేరు కదా అని చిన్నప్పుడు తనకి అమ్మకొంగుతో అల్లుకున్న జ్ణాపకాలన్ని కళ్లముందు తిరిగాయి.ఈ మధ్య సోషల్ మీడియాలో అమ్మకొంగు గొప్పతనం గురించి ఒక పోస్టు వైరలవుతుంది.

అదేంటో మీరూ చదవండి.ఇది రాసిన వ్యక్తి కూడా ఇలాంటి అనుభవమే ఎదురై ఉంటుంది.

మా అమ్మ (చీర) కొంగు

ఇప్పటి పిల్లలకు చాలా మంది కి తెలియక పోవచ్చు.ఎందుకంటే నేటి మమ్మీలు చీరకట్టు తక్కువే.చీరకొంగు చీర అందానికే సొగసునుపెంచేె మకుట మాణిక్యం ! అంతేకాకుండా .

పొయ్యి మీద వేడి గిన్నెలను దింపడానికి పనికొచ్చేి ముఖ్య సాధనం

పిల్లల కన్నీటిని తుడిచే ముఖ్యమైన పరికరం

చంటిపిల్లలు పడుకోడానికి అమ్మవడి పరుపు కాగా వెచ్చటి దుప్పటి‌ చీరకొంగే!

కొత్త వారు ఇంటికొచ్చినపుడు సిగ్గు పడే పిల్లలు ముఖం దాచుకునేది అమ్మ కొంగు వెనకే.అలాగే పిల్లలు ఈ మహా చెడ్డ ప్రపంచంలో కొత్తగా అడుగు లేస్తున్నప్పుడు అమ్మ కొంగేే పెద్ద దిక్సూచి, మార్గదర్శి!

అలాగే వాతావరణం:చలిగా ఉంటే అమ్మ కొంగుతోనే పిల్లలని వెచ్చగా చుట్టేది !

వంటచేసే తల్లి చెమట బిందువులు తుడుచు కొనేది కొంగు తోనే !

వంటకు పొయ్యిలోకి తెచ్చే కట్ట ముక్కలు సూదులు తెచ్చేది కొంగులోనే!

అలాగే పెరటి తోటలో కూరగాయలు, పువ్వులు, ఆకుకూరలు వంటింటికి తీసుకొచ్చేది కొంగులోనే.

అంతేకాదు ఇల్లు సర్దడం లో భాగంగా పిల్లల ఆట వస్తువులు పాత బట్టలు వంటివి చీర కొంగు లోనే కదా మూట కట్టేది!

ఇలాంటి ఎన్నో ఉపయోగాలు ఉన్న అమ్మ చీరకొంగు లాంటి వస్తువు మరొకటి కనిపెట్టాలంటే చాలా కష్టం!

ఇంతటి అద్భుతమైన అమ్మకొంగు లో కనిపించేది మాత్రం అమ్మ ప్రేమే !!

అంకితం: చీర కట్టే అమ్మలందరికీ !

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube