జిగేలు రాణి సింగర్ ఆవేదన.. పాడినందుకు సంతోషించాలో బాధపడాలో అర్థం కావడం లేదు! అసలేమైంది?

“రంగస్థల గ్రామ ప్రజలందరికి విగ్నప్తి మనందరి కల్లల్లో జిగేల్ నింపడానికి జిగేల్ రాణి వచ్చింది.

 Jigelu Rani Singer Venkata Lakshmi Talks About Injustice-TeluguStop.com

ఆడి పాడి అలరించేద్దది అంతే… మీరందరు రెడిగుండండి.

అమ్మ జిగేల్ రాణి వచ్చెయ్యమ్మా నువ్వు”

జిగేలు రాణి అయితే తెరమీదకు వచ్చింది కానీ ఆమె గొంతుకి మాత్రం ఇంకా డబ్బులివ్వలేదు.మ్యాటర్ అర్ధం కాలేదు కదా.? అసలు కథ ఏంటి అంటే…రాంచరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా, బాహుబలి తరువాత టాలీవుడ్ లో అంతటి ఘన విజయంగా నిలిచింది “రంగస్థలం”.సుకుమార్ చిత్రాలలో ఐటమ్ సాంగ్ కు ప్రాధాన్యత ఉంటుంది.

ఈ చిత్రంలో కూడా జిగేలు రాణి సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.కానీ తనకు మాత్రం అన్యాయం జరిగిందని జిగేలు రాణి సాంగ్ పాడిన సింగర్ గంటా వెంకట లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఈ పాట పాడింది ఒక సాధారణ గృహిణి.విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన వెంకటలక్ష్మి అనే మహిళ ఈ పాటను పాడింది.రెండురోజుల పాటు చెన్నైలో ఉన్న వెంకటలక్ష్మి జిగేలు రాజ పాట పాడింది.అసలు ఈమెకు ఎలా ఆ అవకాశం వచ్చిందంటే బుర్రకథల్లో ఎన్నో పాటలు పాడిన వెంకటలక్ష్మిని దర్శకుడు సుకుమార్ యూ ట్యూబ్ ద్వారా చూశారు.

దీంతో ఆమెను తీసుకురావాలని కొంతమందికి సూచించారు.మధ్యవర్తులు కొంతమంది వెంకటలక్ష్మిని తీసుకెళ్ళి పాట పాడించారు.

సినిమా వందరోజులు పూర్తి చేసుకుంది.కానీ ఇంతవరకు వెంకటలక్ష్మికి మాత్రం రెమ్యునరేషన్ మాత్రం ఇవ్వలేదట.

సినీపరిశ్రమలో జిలుగు వెలుగుల వెనుక దాగిన చీకటికి ఇంతకు ఇది తాజా ఉదాహరణ మాత్రమే.పాటకు హిట్టయినందుకు తనకు సంతోషంగా ఉందని, అయితే డబ్బులు కూడా ఇచ్చి ఉంటే బాగుండేదని వెంకటలక్ష్మి మీడియాతో అంది.

“నేను బుర్రకథ కళాకారిణిని.సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ మా బుర్ర కథను యూట్యూబ్లో చూసి ‘జిగేల్ రాణి’ పాట పాడేందుకు తీసుకున్నారు.

అసలు ఈ పాట నేను పాడానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది.ఏదో పాడించుకున్నారు.సినిమాలో పెడతారో పెట్టరో అనుకున్నా.పాట కచ్చింతగా ఉంటుందని దేవీశ్రీ ప్రసాద్ గారు చెప్పారు.

పాట అందరికీ నచ్చింది.అందరూ పాడుకుంటూ ఉంటే సంతోషంగా ఉంది.

పాటకు ఇంత డబ్బు అని అప్పుడు మాట్లాడుకోలేదు.అందుకే ఇంకా ఇవ్వలేదు.”

భర్త మరణించి కిరాణా కొట్టుతో జీవితం గడుపుతున్నానని తెలిపింది.నేను పేద మహిళని దేవిశ్రీ కి తెలియకపోవచ్చు.

కానీ ఆ మధ్యవర్తికి తెలుసు.డబ్బు మొత్తం అతడే తీసుకుని మోసం చేశారని వెంకట లక్ష్మి ఆరోపించింది.

ఆ గట్టునుంటావా పాత విషయంలో కూడా ఇదే తరహాలో జరిగిన అన్యాయం గురించి అందరికి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube