సుదీర్ఘ ప్రేమాయణం తర్వాత సమంత, నాగచైతన్యలు గత సంవత్సరం ఒక్కటి అయ్యారు.వీరి ప్రేమ విషయమై దాదాపు రెండు సంవత్సరాల పాటు మీడియాలో అవునా, కాదా అంటూ నాన్చుతూ వచ్చారు.
చివరకు చిన్న చిన్న లీక్స్‌తో చైతూ, సమంతల మద్య ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది.అవును నిజమే ఇద్దరం ప్రేమలో ఉన్నాం, ప్రేమించుకుంటున్నాం అంటూ ప్రకటించారు.
ఎంతో వైభవంగా వీరిద్దరి వివాహం జరిగింది.ఇక వివాహం తర్వాత వీరిద్దరు ఒక యాడ్‌లో నటించారు తప్ప సినిమాలో నటించింది లేదు.
పెళ్లికి ముందు మూడు చిత్రాల్లో నటించిన వీరిద్దరు పెళ్లి తర్వాత మాత్రం కలిసి నటించలేదు.వీరిద్దరు ఎట్టకేలకు ఒక చిత్రంలో నటించేందుకు సిద్దం అయ్యారు.
ఎంతో ప్రేమగా ఉంటూ, వివాహ జీవితాన్ని ఆనందంగా గడిపేస్తున్న నాగచైతన్య మరియు సమంతల మద్య ఒక అమ్మాయి వచ్చి, సంసార జీవితాన్ని నాశనం చేస్తుంది.ఆ అమ్మాయి వల్ల ఇద్దరు విడిపోయే వరకు వస్తారు.
ఆ అమ్మాయి నాగచైతన్యపై మోజు పెంచుకుని సమంతను దూరం పెట్టేలా చేస్తుంది.అయితే చైతూ మాత్రం సమంతను మాత్రమే ప్రేమిస్తున్నాడు.
ఆ విషయాన్ని తెలుసుకోకుండా ఆ అమ్మాయి మోసపూరిత వ్యాఖ్యలకు సమంత మోసపోయి చైతూపై అనుమాన పడుతూ ఉంటుంది… ఆశ్చర్యపోతున్నారా, ఇది నిజంగా కాదు కాని, సమంత, నాగచైతన్య కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కథ.

‘నిన్నుకోరి’ చిత్రంతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు శివ నిర్వాణ ప్రస్తుతం నాగచైతన్య, సమంతల కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు.నిన్నుకోరి చిత్రంలో హీరోయిన్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.విభిన్నమైన ప్రేమ కథతో ఆ చిత్రం తెరకెక్కింది.
ఇప్పుడు అదే తరహా ప్రేమ కథను నాగచైతన్య, సమంతల కోసం సిద్దం చేసినట్లుగా సమాచారం అందుతుంది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యి షూటింగ్‌కు రెడీ అవుతుంది.
ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు.నాగచైతన్య ప్రస్తుతం ‘శైలజరెడ్డి అల్లుడు’ మరియు ‘సవ్యసాచి’ చిత్రాలతో ప్రేక్షకలు ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.
ఆ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో మూవీని ప్రారంభించబోతున్నాడు.ఇదే సంవత్సరం చివర్లో ఈ చిత్రం వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు కోన వెంకట్‌తో కలిసి ఈ చిత్ర నిర్మాణంలో నాగచైతన్య మరియు సమంతలు కూడా భాగస్వామ్యులు కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.








