టీడీపీకి ఉండవల్లి సలహాలు ... ఇదేదో అనుమానంగా ఉందే

రాజకీయాల్లో ఎప్పుడు ఎలా మలుపులు తిరుగుతాయో చెప్పలేము.అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనేది.

 Undavalli Arun Kumar To Serve As Political Advisor In Tdp-TeluguStop.com

ఇప్పుడు ఇదే సామెతను నిజం చేస్తూ టీడీపీకి బద్ద శత్రువు అయినా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు టీడీపీ కి సలహాలు అందించేందుకు సిద్ధం అయ్యాడు.కొద్దీ నెలల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కూడా సలహాలు అందించాడు.

అయితే అప్పుడు ఉండవల్లి జనసేనలోకి వెళ్తున్నారని వార్తలు వినిపించాయి.కానీ పవన్ తో వారి వ్యవహారం చెడడంతో అక్కడితో పులిస్టాప్ పడింది.

మళ్ళీ ఇప్పుడు ఆయన అకస్మాత్తుగా చంద్ర బాబు నాయుడుతో భేటీ అవ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఉండవల్లి అరుణ్ కుమార్‌కి ఒక ‘అవకాశం’ కల్పించే ప్రతిపాదనను చంద్రబాబు చంద్రబాబు తీసుకొచ్చినట్టు తాజా సమాచారం.కానీ.ముక్కుసూటిగా మాట్లాడే రాజకీయ వేత్తగా పేరున్న ఉండవల్లికి చంద్రబాబు రాజకీయం మీద ఎప్పటుంచో కొంత వ్యతిరేకత వుంది.

ఈ నేపథ్యంలో బాబు టీమ్‌లో చేరడానికి ఆయన అంగీకరిస్తారా లేదా అనే అనుమానాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే ఉండవల్లి అరుణ్ కుమార్ సోమవారం సాయంత్రం అమరావతి సచివాలయంలో ప్రత్యక్షమయ్యారు.

సీఎంఓ ఆహ్వానం మేరకే తాను సెక్రటేరియట్‌కి వచ్చినట్లు ఉండవల్లి మీడియాతో చెప్పారు.

విభజన హామీలను పార్లమెంటులో లేవనెత్తాలని ఉండవల్లి గత వారం చంద్రబాబుకు మీడియా ముఖంగా సలహా ఇచ్చారు.‘తలుపులు మూసి విభజన బిల్లు పాస్ చేశారంటూ ఇటీవల ప్రధాని హోదాలో మోదీయే ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో.అదే విభజన బిల్లు మీద ఈసారి మోదీ సమక్షంలోనే గట్టిగా చర్చించాలి’ అన్నది ఉండవల్లి సూచన.

గతంలో టీడీపీ, వైసీపీ పోటీపడి మరీ పార్లమెంటులో పెట్టిన ‘అవిశ్వాసం’ ఐడియా కూడా ఉండవల్లిదే.మరో రెండు రోజుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి.మోదీ సర్కార్ మీద రెండోసారి అవిశ్వాసం పెట్టాలన్న కసరత్తు చేస్తోంది టీడీపీ ఈ నేపథ్యంలో ఉండవల్లి సలహాలు తీసుకునేందుకు ఆయన్ను చంద్రబాబు పిలిపించినట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే ఉండవల్లికి టీడీపీ రాజకీయ సలాదారుడిగా అవకాశం కల్పిస్తున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube