ప్రస్తుతం బ్యాంకు ఆసీకౌట్ కావాలన్నా, సిం కార్డు కొనాలన్నా .ఇలా అనేక వాటికి పాన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది.
బయట జిరాక్స్ షాపుల్లో మనం జిరాక్స్ తీయిస్తూ ఉంటాము.అవసరం కి మనం తీయిస్తే అదే వాళ్ళు ఆసరాగా చేసుకుంటున్నారు.
మన నుంచి సేకరించిన సమాచారాన్ని కొందరు సైబర్ నేరస్థులకు విక్రయిస్తున్న ఉదంతం ఇటీవల వెలుగులోకి వచ్చింది.ఇలా వివిధ ఏజెన్సీలు, సంస్థల నుంచి కార్డు హోల్టర్ల వివరాలు సేకరిస్తున్న సైబర్ నేరగాళ్లు ఏకంగా కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి, మాటల్లో పెట్టి మన ఖాతాలను లూటీ చేస్తున్నారు.
బ్యాంకు లావాదేవీలు, ఇతర ఆన్‌లైన్ చెల్లింపులు చేసే కొన్ని ఏజెన్సీలు కస్టమర్ల నుంచి సేకరించిన ఫోన్ నెంబర్లను నెంబర్‌కు ఇంత అని ధర నిర్ణయించి సైబర్ నేరగాళ్లకు అమ్ముకుంటున్నారు.కొత్త సిమ్ కొనుగోలు చేస్తున్న కస్టమర్ల నుంచి టెలీకాం సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు సేకరించిన సమాచారాన్ని, చిరునామాలను, ఫోన్ నెంబర్లను ఏజెన్సీలకు కమిషన్ రూపంలో అమ్ముతున్నారు.

ఒక ప్రైవే టు డాటాబేస్ సంస్థ నుంచి షేర్ హో ల్డర్స్ వివరాలు కొనుగోలు చేసిన కొం దరు ఫోరెక్స్ ట్రేడింగ్ పేరుతో షేర్ హోల్టర్స్‌కు ఫోన్ చేసి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ ముగ్గులో కి దింపి రూ.కోట్లు కొల్లగొట్టినట్లు తేలింది.ఆన్‌లైన్‌లో ఉద్యోగాలిస్తామని, రెజ్యూమ్ వివరాలు అప్‌లోడ్ చేయాలని నిరుద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తున్న కొందరు ఉద్యోగం చూపకపోగా నిరుద్యోగుల సమాచారాన్ని కొన్ని కాల్‌సెంటర్లకు అమ్ముకుంటున్నారు.దాంతో సైబర్ కేటుగాళ్లు ఉద్యోగాల ఇప్పిస్తామని నిరుద్యోగులకు ఫోన్ చేసి, ఆన్‌లైన్‌లో నకిలీ నియామక పత్రాలు పంపడంతో పాటు వివిధ రకాల ఫీజుల పేరుతో రూ.లక్షలు కాజేస్తున్నారు.
అంతేకాదు కొందరు జిరాక్స్ సెంటర్ నిర్వాహకులు తమ వద్దకు వచ్చే కస్టమర్ల ఆధార్, పాన్, ఓటర్, రేషన్ కార్డుల జిరాక్స్‌లను ఒక్కో కాపీ ఎక్కువగా తీసి భద్ర పరిచి ప్రైవేటు ఏజెన్సీలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు
.






