దేశవ్యాప్తంగా బీజేపీ రాజకీయ గడ్డు పరిస్థితిని ఎదుర్కుంటోంది.వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచే అవకాశాలు కూడా సన్నగిల్లుతున్నాయి.
ఈ పరిస్థితిని గమనించే బీజేపీ పెద్దలు ఇప్పుడు రాష్ట్రాల పర్యటనలు చేస్తూ .జరిగిన నష్టాన్ని పూడ్చుకునే పనిలో పడ్డారు.ఇక ఏపీ విషయానికి వస్తే… బీజేపీ చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు.ఆరుకోట్ల ఆంధ్రులను హోదా విషయం లో మోసమే చేశాడు.హోదా వచ్చి ఉంటే ఈ నాలుగేళ్లలో ఎన్నో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఏపీకి వచ్చి ఉండేవి.కానీ మోదీ చేసిన మోసం ఏపీకి శాపంగా మారింది.
గత నాలుగేళ్లలో జరగాల్సిన అభివృధ్ది ఆంధ్రాలో ఆగిపోయింది.ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే మోదీ చేపట్టిన అనేక సంస్కరణలు ఆ పార్టీకి మేలు కంటే కీడు ఎక్కువ చేసాయి.

ప్రస్తుతం ఏపీలో బీజేపీ బోణీ కొట్టే పరిస్థితి కనిపించడంలేదు.బీజేపీయే కాదు ఆ పార్టీతో జట్టు కట్టే పార్టీలకు కూడా ఆ ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది.ఈ విషయాన్ని ముందే గ్రహించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముందుగానే ఎన్డీఏ కూటమి నుంచి బయటకి వచ్చేసాడు.ప్రస్తుతం బీజేపీ పై ఒంటికాలిపై లేస్తూ రాజకీయంగా బీజేపీకి టీడీపీ కి వైరం ఉందని ప్రజల్లో నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.
ప్రత్యేకహోదా ఇవ్వని మోడీని పల్లెత్తు మాట అనకుండా, బీజేపీకి వంత పాడుతూ, ఆ పార్టీతో స్నేహానికి జగన్ సిద్ధం అయినట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు తొందరపడి ఎన్డీఏ నుంచి వైదొలగారని, హోదా విషయంలో మోడీ సానుకూలంగా స్పందిస్తారని చెప్పుకొచ్చారు.జగన్ ను ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నామనీ అథవాలే చెప్పారు.
అంతే కాదు జగన్ మాతో జత కడితే.ఎన్నికల తరువాత ఏపీ ముఖ్యమంత్రి అయ్యేందుకు తాము సహకరిస్తామన్నారు.
ఆయన ఆహ్వానం మేరకు జగన్ పార్టీ ఎన్టీఏలో చేరితే ఇక 2019లో ఏపీలో వైకాపా ఆశలు వదులుకోవాల్సిందే.బీజేపీ మీద ఉన్న కోపం జగన్ పార్టీకి శాపంగా మారుతుంది.
జగన్ ని రాజకీయంగా నిండా ముంచేందుకేనా అన్నట్టు బీజేపీ వైసీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది.







