బాబు ఆ మంత్రుల్ని తప్పించానున్నారా..

ఏపీ మంత్రి వర్గ విస్తరణ పై చంద్రాబు మేధో మధనం చేస్తున్నారు.ఎన్నడూ లేనంతగా ఈ విస్తరణపై తర్జన భర్జన పడుతున్నారని తెలుస్తోంది.

 Did Chandrababu Naidu Eliminating Bjp Ministers-TeluguStop.com

ఖాళీ అయిన రెండు బెర్తులకోసం ఒక టెన్షన్ అయితే మరొక టెన్షన్ ఏమిటంటే ఇప్పుడు ఉన్న పని చేయని వ్యతిరేకత మూటగట్టుకున్న మంత్రుల్ని తొలగించడం.ఇప్పుడు ఇదే బాబు కి అతిపెద్ద సమస్యగా మారిపోయింది.

ఎన్డీయే లో నుంచీ బయటకి వచ్చిన తరువాత ఏపీ కేబినేట్ లో బిజేపీ మంత్రులు తొలగిపోయినపుడు ఖాళీగా ఉన్న రెండు శాఖల్ని బాబు ఇప్పుడు భర్తీ చేయనున్న విషయం అందరికీ తెలిసిందే అయితే చేస్తే గీస్తే ఇదే క్యాబినెట్ చివరి విస్తరణ కావడం తో చాలా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తోంది.

అయితే ఈ రెండు మంత్రి పదవులలో మైనారిటీల కోసం ఒక పోస్ట్ ఇప్పటికే కేటాయించారు బాబు ఈ విషయం అందరికీ తెలిసిందే.మరొక మంత్రి పదవిని తూర్పుగోదావరి నుంచీ కాపు నేతకి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట.ఇప్పటికే కాపుల నుంచీ ఒకరికి తన క్యాబినెట్ లో చోటు కల్పించిన బాబు మరొకరికి పదవి ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది.

అది కూడా తూర్పు నుంచీ ఇవ్వడం ద్వారా ముద్రగడకి కూడా చెక్ పెట్టినట్టు ఉంటుందని భావిస్తున్నారు.అయితే వైసీపి నుంచీ టీడీపీ లోకి వచ్చిన సీనియర్ నేత జ్యోతుల కి ఈ పదవి కట్టబెట్టనున్నారని తెలుస్తోంది.

ఇక్కడ వరకూ బాగానే ఉన్నా అసలు కధ ఇక్కడే మొదలవుతోంది.

అదేంటంటే.

మంత్రివర్గం మొత్తంగా విస్తరణ తో పాటు గా క్యాబినెట్ లో పని తీరు బాగోలేని మంత్రుల్ని తప్పిస్తే ఎలా ఉంటుంది అనే విషయంపై అబ్బు తీవ్ర కసరత్తు చేస్తున్నారట.గతంలో విస్తరణ సమయంలో కొందరు మంత్రుల్ని తొలగించిన మంత్రుల్ని.

రాజకీయ లబ్ది మేరకు మళ్ళీ పదవులు కట్టబెట్టాలా అని ఆలోచన చేస్తున్నారు…దాంతో ఇప్పుడు ఉన్న పని చేయని విమర్శలు ఎదుర్కుంటున్న మంత్రులకి భయం పట్టుకుంది.ఇప్పటికే బాబు దగ్గర పని చేయని వారి లిస్టు ఉందని ఈ విషయంలో బాబు ముందుగానే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

దాంతో ఎవరు ఉంటారో ఎవరు పోతారు అనేది ఎవరికీ తెలియని పరిస్థితి.అయితే బాబు ఈ క్రమంలోనే నామినేటడ్ పదవులని భర్తీ చేయడానికి సిద్దపడ్డారు.

నామినేటడ్ పదవులు ఇచ్చేసి జిల్లా వ్యాప్తంగా పర్యటనలు కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నారట.ఈనెల 12వ తేదీన పార్టీ పోలిట్‌బ్యూరో, సమన్వయ కమిటీ సమావేశాలు జరగనున్నాయి.

సమావేశాల్లో వచ్చే ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గ విస్తరణ ప్రకటించాలని కూడా అధినేత మదిలో భావనగా చెప్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube