దోమ కాటు కారణంగా వచ్చే వాపు, మంట తగ్గటానికి అరటి పండు తొక్క..

దోమ కాటు కారణంగా వచ్చే వాపు, మంటను అరటి పండు తొక్క ఎలా తగ్గిస్తుందా అని ఆశ్చర్యపోతున్నారా? అరటిపండు తొక్కలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన వాపు మీద వ్యతిరేకంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుంది.అసలు అరటిపండు తొక్కను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

 Inflammation Due To Mosquito Bites Banana Peel To Reduce Inflammation Details, M-TeluguStop.com

ఈ చిట్కాకు కేవలం అరటిపండు తొక్క మరియు గ్లిజరిన్ అవసరం అవుతాయి.

అరటిపండు తొక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన దోమ కాటు కారణంగా వచ్చే దద్దుర్ల సైజ్ తగ్గించి మంట తగ్గేలా చేస్తాయి.

అరటిపండు తొక్క దోమ కుట్టిన ప్రాంతంలో దురదను తగ్గించి శాంతపరుస్తుంది.దాంతో నొప్పి, మంట తగ్గుతాయి.

గ్లిజరిన్ లో ఉన్న గుణాలు దోమ కుట్టిన ప్రదేశాన్ని సున్నితంగా, తేమగా ఉండేలా చేయటంలో సహాయపడతాయి.అంతేకాక ఆ ప్రాంతం నల్లగా మారకుండా చేస్తుంది.

గ్లిజరిన్ మందుల షాప్ లో దొరుకుతుంది.

Telugu Banana, Banana Peel, Glycerin, Tips, Mosquito, Mosquito Bite, Reduce-Telu

ఒక అరటిపండు తొక్కలో సగ భాగాన్ని తీసుకోని దానిలో కొంచెం గ్లిజరిన్ వేసి మెత్తని పేస్ట్ గా తయారుచేయాలి.ఈ పేస్ట్ ని దోమ కుట్టిన ప్రదేశంలో రాసి 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా రోజులో రెండు సార్లు చేస్తే తొందరగా దోమ కాటు మంట, వాపు నుండి ఉపశమనం కలుగుతుంది.

ఈ రెమెడీ చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube