భారత సంతతికి చెందినవారు ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న తరుణం రానే వచ్చింది…అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడాలని అనుకున్న ఎంతో మంది భారత సంతతి వ్యక్తుల కల నిజమయ్యే రోజు దగ్గరలోనే ఉంది.ఎంతో మంది భారత ఎన్నారైలు ఈ తరుణం కోసం వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్నారు.2020 ఎన్నికల్లో.ఈ కోరిక తీరే అవకాశం ఉందని అంటున్నారు.
ఏంటి నమ్మలేక పోతున్నారా.?
భారత సంతతికి చెందిన అమెరికా సెనేటర్ కమలా హారిష్ వచ్చే ఎన్నికల్లో తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని చెప్పీ చెప్పక ఆసక్తిని రేకెత్తించారు.ఆమె పోటీ చేయవచ్చనే అంచనాలు భారీగా ఉన్నాయి…53 ఏళ్ల కమల.అమెరికా సెనేట్‌కు ఎన్నికైన మొదటి భారత సంతతి వ్యక్తి.ఆమె డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు.అయితే 2020లో అధ్యక్ష పదవి పోటీ చసే అవకాశాన్ని ఖండిస్తున్నారా అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు లేదని అని ఆమె జవాబు చెప్పారు…దాంతో తానూ రేసులో ఉన్నాను అని చెప్పకనే చెప్పారు.
అయితే ఆమె పూర్తిగా భిన్నంగా వెళ్తున్నారు…ఎంతో మందిని ఆకట్టుకుంటున్నారు.ట్రంప్ విధానాల వల్ల నష్టపోతున్న వలసదారులకు ఆమె మద్దతు తెలుపుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో వారి ఓట్లు ఆమెకు అదనపు బలం కావచ్చనే అంచనాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.వలసవాదులకు సంబంధించి ట్రంప్ ప్రభుత్వం తలపెట్టిన మార్పులకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆమె గత ఏడాది తన పార్టీ నేతలను కోరారు.
అయితే 2016 లో సెనేట్‌కు ఎన్నిక కాకముందు ఆమె కాలిఫోర్నియా అటార్నీ జనరల్ గా పనిచేశారు.అమెరికా అధ్యక్ష ఫీటాన్ని అలంకరించాలి అనే గట్టి సంకల్పం ఆమెకి బలంగా ఉందని అంటున్నారు.
ఈ విషయంపై ఆమె తరచూ ఎదో ఒక సందర్భంలో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు.నిజంగా ఆమె పోటీ చేసి ఎన్నికల్లో నిలబడితే మాత్రం తప్పకుండా భారత సంతతి ఎన్నారైలు.
వలస జీవులు ఇలా ఎంతో మంది ఆమెకి మద్దతుగా నిలువనున్నారని అంటున్నారు అమెరికన్ రాజకీయ విశ్లేషకులు.