జనసేన పార్టీలో జనసేన అనే పదంలో ఉన్న జనం పార్టీలో కనిపించడం లేదు.ఒంటికాయకొమ్ము లాగా పవన్ కళ్యాణ్ ఒక్కడే కనిపిస్తూ ఉంటాడు.
అయితే నాలుగేళ్ల కాలంలో ఒక్క వ్యక్తిని కూడా పార్టీలోకి ఆహ్వానించకుండా నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న పవన్ తీరు పట్ల విసుగు చెందిన అన్న చిరంజీవి మొత్తానికి నడుం బిగించాడు.పార్టీ భాద్యతలని మీద వేసుకున్నాడు.
తెలుగుదేశంతో పడక బయటకి వచ్చేస్తున్న కీలక నేతలని ఆకర్షించడం కూడా చేయకుండా ఒక్కడే ఎన్నాళ్ళు ఉంటావ్ అంటూ క్లాస్ పీకిన చిరు ఇప్పుడు జనసేనని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు.అందులో భాగంగానే.

కాంగ్రెస్ లో చిరుకి ఉన్న విస్తృత పరిచయాలతో కొందరు ముఖ్య నేతలను జనసేన లోకి తీసుకుని వస్తున్నారని సమాచారం, చిరంజీవి కి అత్యంత సన్నహిత మిత్రుడు అయిన అసెంబ్లీ మాజీ స్పీకర్, కాంగ్రెస్ నేత నాదెండ్ల మనోహర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు.నాదెండ్ల మనోహార్ ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు.అయితే పవన్ నాదెండ్ల భేటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది…ఈ భేటీ ఏందుకు అనేది ఖచ్చితంగా తెలియకపోయినా ఆయన వచ్చే ఎన్నికల్లో జనసేన లోకి వెళ్తారని సంచారం అందుతోంది.
2011 జూన్‌లో నాదెండ్ల ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ స్పీకర్‌గా ఎన్నికయ్యారు…ఆయన 2004 నుంచి 2009 వరకు గుంటూరు జిల్లా తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు…అయితే రాష్ట్రం విడిపోయాక జరిగిన 2014 ఓటమి చవిచూసిన నాదెండ్ల ఇప్పుడు జనసేనలోకి వెళ్తున్నారు అనే వార్తలు తన సొంత నియోజకవర్గంలో హల్చల్ చేస్తున్నాయి…నాదెండ్ల మనోహర్ సొంత నియోజకవర్గం తెనాలిలో దీనికి సంభందించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి…గత నెలలో విశాఖ లో జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో చిరు నాదెండ్ల మీట్ అయ్యారని ఆ భేటీ సందర్భంగా జనసేన లోకి రావాలని కోరారు అని తెలుస్తుంది.
అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఎంతో దారుణంగా మారింది మరో పక్క తెలుగు దేశంలో కి వెళ్ళలేని పరిస్థితి ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ నేతలు వేరే పర్తీలలోకి జంప్ అయ్యారు కూడా ఈ తరుణంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.ఈ ఎన్నికలలో పోటీ చేయకపోతే ఇక రాజకీయ భవిష్యత్తు మాత్రం సూన్యం అని వార్తలు వస్తున్నా నేపధ్యంలోఅ నాదెండ్ల జనసేనలోకి వెళ్ళడానికి ఫిక్స్ అయ్యారట…అంతేకాదు నాదెండ్లతో పాటు మరికొంత మంది కాంగ్రెస్ నాయకులు జనసేన లోకి చేరుతారని తెలుస్తుంది.
నాదెండ్ల మనోహర్ కి తెనాలిలో గట్టి వర్గం ఉంది ఈ వర్గం వారిని కాపాడుకోవడానికి తన రాజకీయ భవిష్యత్తు ని తన రాజకీయ భవిష్యత్తు ని నిలబెట్టుకోవడానికి నాదెండ్ల జనసేనలోకి ఎంట్రీ ఇస్తున్నారని త్వరలో డేట్ కూడా ఫిక్స్ చేయనున్నారని తెలుస్తోంది.