అమెరికా నిర్భందంలో మరో 100 మంది భారతీయులు

అమెరికాలో భారతీయుల నిర్భంధం రోజు రోజు కి పెరిగిపోతోంది.రెండు రోజుల క్రితం అమెరికా లో వలసదారులని నిర్భందించిన సమయంలో దాదాపు 50 మంది వరకూ ఉండగా తాజాగా నిర్భంధంలోకి మరో 50 మందిని ఉంచారు.

 Nearly 100 Indians Held In Us For Illegal Immigration-TeluguStop.com

వీరిని రెండు నిర్భంద కేంద్రాలలో ఉంచారని.వీరిలో దాదాపు వంద మందికిపైగా భారతీయులు ఉన్నట్లు అమెరికాలోని ఇండియన్ మిషన్ ప్రకటించింది.

అయితే ఈ 100 మందిలో అధికశాతం మంది పంజాబ్ రాష్ట్రానికి చెందినా వారు ఉన్నారట.

అయితే వీరిని న్యూ మెక్సికో సరిహద్దుల్లోని ఫెడరల్ డిటెన్షన్ సెంటర్‌లో 40 నుంచి 45 మంది భారతీయులు, ఆరిగాన్ డిటెన్షన్ సెంటర్‌లో 52 మంది సిక్కులు, క్రైస్తవులు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది.ఇదిలాఉంటే భారత ఎంబసీ అధికారులు ఈ రెండు కేంద్రాలకి వెళ్లి అక్కడ పరిస్థితులని పరిశీలించి వచ్చారట.ఈ కేంద్రాల్లో ఉన్న వారు ఆశ్రయం అడుగుతున్నారని తెలిపారు…ఉత్తర అమెరికా పంజాబ్ అసోసియేషన్‌కు చెందిన సత్నామ్ సింగ్ చాహల్ మాట్లాడుతూ అమెరికా జైళ్లలో మగ్గుతున్న వారిలో పంజాబీయులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పారు.

గతంలో అంటే 2013.నుంచి 2015 వరకు గడిచిన మూడేళ్ళ కాలంలో అమెరికా సరిహద్దుల్లో 27వేల మంది భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు…ఇందులో 4వేల మంది మహిళలు, 350 మంది బాలబాలికలు ఉన్నారు.

అ.అయితే ఎంతో మంది అక్రమంగా పంజాబీలు అమెరికాలోకి వెళ్ళడానికి కారణం మానవ అక్రమ రవాణాదారులకు, అధికారులు, రాజకీయ నేతల మధ్య ఉన్న చట్టవ్యతిరేక సంబంధాల వల్లేనని ఉత్తర అమెరికా పంజాబీ సంఘం ప్రతినిధి సత్నామ్ సింగ్ చౌహాల్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube