ఎన్నో చర్మ సమస్యలకు చెక్ పెట్టె.... యూకలిఫ్టస్ ఆయిల్

యూకలిఫ్టస్ ఆయిల్ ని ఉపయోగించి ఎన్నో చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు.యూకలిఫ్టస్ ఆయిల్ ని యూకలిఫ్టస్ చెట్టు ఆకుల నుండి తయారుచేస్తారు.

 Eucalyptus Oil Beauty Benefits-TeluguStop.com

ఈ ఆయిల్ మనకు మార్కెట్ లో సులభంగానే అందుబాటులో ఉంటుంది.ఇప్పుడు యూకలిఫ్టస్ ఆయిల్ ని ఉపయోగించి ముఖ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం.

ఒక స్పూన్ ఇప్సమ్ సాల్ట్ లో ఒక స్పూన్ యూకలిఫ్టస్ ఆయిల్ ని కలిపి ముఖానికి పట్టించి స్క్రబింగ్ చేయాలి.ఈ విధంగా చేయటం వలన చర్మంలో మృత కణాలు తొలగిపోతాయి.

ఒక స్పూన్ వేపాకుల పొడిలో సరిపడా యూకలిఫ్టస్ ఆయిల్ ని వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమల సమస్యలు తొలగిపోతాయి.

ఒక స్పూన్ అవకాడో జ్యుస్ లో ఒక స్పూన్ యూకలిఫ్టస్ ఆయిల్ ని వేసి బాగా కలిపి ముఖానికి రాసి 10 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మంలో తేమ పెరుగుతుంది.

ఎండలోకి వెళ్లి వచ్చినప్పుడు ఎండ కారణంగా చర్మం కమిలిపోతుంది.అప్పుడు కొంచెం యూకలిఫ్టస్ ఆయిల్ ని ముఖానికి రాసుకొని ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం ప్రశాంతంగా ఎటువంటి చికాకు లేకుండా ఉంటుంది.

ఒక స్పూన్ పసుపులో ఒక స్పూన్ యూకలిఫ్టస్ ఆయిల్ కలిపి ముఖానికి రాసి 15 నిముషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ఏ చర్మ సమస్య అయిన తగ్గిపోతుంది.పసుపు,యూకలిఫ్టస్ ఆయిల్ లో ఉన్న యాంటీ సెప్టిక్ గుణాలు చర్మ సంరక్షణలో సహాయపడతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube