అసలు టి.ఆర్.ఫై రేటింగ్ అంటే ఏంటి? అది ఎలా ఇస్తారు.?

బిగ్ బాస్ 2 టి.ఆర్.

 What Is Trp And How It Is Calculated-TeluguStop.com

ఫై రేటింగ్ ఇటీవలే విడుదలయ్యింది.తొలివారం 16 రేటింగ్ ఉంది.

బిగ్ బాస్ 1 తో పోలిస్తే ఇది తక్కువే.ఈ రేటింగ్ ని బట్టి ఎంత మంది షో చూస్తున్నారో చెప్పొచ్చు అంటారు.

అసలు ఈ రేటింగ్ ఎలా ఇస్తారు.? అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఇంకెందుకు లేట్ తెలుసుకుందాం రండి.

బార్క్‌ రేటింగ్స్‌ అనే విషయాన్ని మరో మాటలో చెప్పాలంటే టీఆర్‌పీ రేటింగ్‌ అని అనవచ్చు.అంటే టీఆర్‌పీ రేటింగ్‌ ఎంత ఎక్కువ ఉంటే టీవీ చానల్స్‌కు ఆయా ప్రోగ్రామ్‌లకు వచ్చే యాడ్స్‌ అన్ని ఎక్కువగా ఉంటాయన్నమాట.దీంతో చానల్స్‌కు కూడా ఆదాయం వస్తుంది.టీఆర్‌పీ రేటింగ్స్‌ను బట్టి వాళ్లు యాడ్‌ రేట్లను ఫిక్స్‌ చేస్తారు.నిర్దిష్టమైన ప్రోగ్రామ్‌కు టీఆర్‌పీ రేటింగ్‌ ఎక్కువ వస్తుంది అనుకోండి.దానికి ఆ చానల్‌ వారు యాడ్స్‌ను ప్రదర్శించినందుకు ఎక్కువ మొత్తం డబ్బు వసూలు చేస్తారన్నమాట.

అందుకు అనుగుణంగానే ప్రోగ్రామ్‌లకు వచ్చే టీఆర్‌పీ రేటింగ్స్‌ను బట్టి యాడ్‌ రేట్లను నిర్ణయిస్తారు.దాంతో టీవీ చానల్స్‌ వారికి ఆ యాడ్స్‌ ద్వారా ఆదాయం వస్తుంది.

అయితే అంతా బాగానే ఉంది.ఈ రేటింగ్స్‌ను ఎవరు ఇస్తారు ? అంటే.అందుకు ఓ సంస్థ పనిచేస్తుంది.దాని పేరు బార్క్‌ (BARC).

బార్క్‌ అంటే Broadcast Audience Research Council India అని అర్థం.ఈ సంస్థ మనదేశంలో ఉన్న అన్ని టీవీ చానళ్ళు, వాటిల్లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్‌లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది.

వాటిల్లో ఆయా భాషలను బట్టి, జనర్‌లను బట్టి వచ్చే ప్రోగ్రామ్‌లను ఎంత మంది చూస్తున్నారు, అవి ఏయే తేదీల్లో, ఏయే సమయాల్లో ప్రసారమవుతున్నాయి, ప్రసారమైన సమయాన్ని బట్టి ఎంత మంది చూస్తున్నారు.తదితర వివరాలను సేకరించి టీఆర్‌పీ రేటింగ్‌ ను ఇస్తుంది.

అయితే ఈ డేటాను సేకరించడం కోసం వారు నిర్దిష్టమైన టీవీలను ఎంచుకుని వాటిల్లో ప్రత్యేకమైన పరికరాలను అమర్చుతారు.ఈ పరికరాలు టీవీల్లో ప్రసారమయ్యే ప్రోగ్రామ్‌లలో వచ్చే ఆడియోలో ఉండే ఎంబెడ్డెడ్‌ వాటర్‌ మార్క్‌ సౌండ్లను గుర్తిస్తాయి.

ఈ వాటర్‌ మార్క్‌ సౌండ్లు మన చెవులకు వినిపించవు.కానీ ఆ పరికరాలు మాత్రం గుర్తిస్తాయి.

దీంతో ఆ పరికరాలు ఆ సౌండ్లను గుర్తించి అందుకు తగిన విధంగా ప్రోగ్రామ్‌ డేటాను జనరేట్‌ చేసి పైన చెప్పిన బార్క్‌ సంస్థకు ఇస్తాయి.వారు ఆ డేటాను విశ్లేషించి ఏ టీవీ చానల్‌ను జనాలు ఎక్కువగా చూస్తున్నారు, ఏ ప్రోగ్రామ్‌ను వారు ఎక్కువగా చూస్తున్నారు అనే డేటాను టేబుల్‌ రూపంలో ఇస్తారు.

అయితే ఈ రేటింగ్స్‌ డేటా ఎప్పుడూ మారుతూ ఉంటుంది.ఎప్పుడూ ఒకే చానల్‌ లేదా ఒకే ప్రోగ్రామ్‌ టాప్‌లో ఉండదు.ఎందుకంటే.ఉదాహరణకు.

ఐపీఎల్‌ మ్యాచ్‌లు వస్తున్నాయి కదా.కనుక సహజంగానే ఆ మ్యాచ్‌లను ప్రసారం చేసే టీవీ చానల్‌నే ఈ సీజన్‌లో ఎక్కువగా చూస్తారు.అది కూడా సాయంత్రం సమయాల్లో కనుక ఆ సమయంలో ఆ చానల్‌ను చూసే వారు ఎక్కువ ఉంటారు కనుక ఆ సమయంలో ఆ చానల్‌కు రేటింగ్‌ ఎక్కువ ఉంటుంది.ఇక మిగిలిన సమయాల్లో ఉండదు, కనుక ఆ చానల్‌కు మిగిలిన సమయాల్లో రేటింగ్‌ మారుతుంది.

ఇలా టీఆర్‌పీ రేటింగ్స్‌ ఉంటాయి.అయితే ఈ రేటింగ్స్‌ను మీరు కూడా ఎప్పుడు పడితే అప్పుడు తెలుసుకోవచ్చు.

అందుకు పైన చెప్పిన బార్క్‌ సైట్‌ https://www.barcindia.co.in/ ను సందర్శించాలి.

దీంతో మీకు కూడా మన దేశంలో ఉన్న టీవీ చానల్స్‌, వాటి ప్రోగ్రామ్‌లకు చెందిన టీఆర్‌పీ రేటింగ్స్‌ తెలుస్తాయి.ఇదీ.టీవీ చానల్ టీఆర్‌పీ రేటింగ్స్‌ వెనుక ఉన్న అసలు కథ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube