తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘కాలా’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంకు రంజిత్ పా దర్శకత్వం వహించాడు.
కబాలి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఆకట్టుకుంటుందని అంతా అనుకుంటున్నారు.‘కబాలి’ చిత్రంతో నిరాశ పర్చిన దర్శకుడు రంజిత్ పా ఈసారి ఖచ్చితంగా సూపర్ స్టార్ స్థాయిలో సినిమాను తీస్తాడంటూ నమ్మకంగా ఉన్నారు.
భారీ ఎత్తున సినిమా విడుదల చేస్తున్నారు.తమిళనాడు మరియు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది.
ఓవర్సీస్ మరియు ఇతర రాష్ట్రాల్లో కూడా దుమ్ము దుమ్ముగా విడుదల చేసి ఈ చిత్రంతో భారీ లాభాలను దక్కించుకోవాలనే పట్టుదలతో నిర్మాత ధనుష్ ఉన్నాడు.సినిమా మినిమం సక్సెస్ అయినా కూడా రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.ఇలాంటి సమయంలోనే సినిమా పైరసీ బయటకు రాకుండా నిర్మాత ధనుష్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.ఎంతగా ప్రయత్నించినా కూడా ‘కాలా’ చిత్రం అప్పుడే పైరసీ వచ్చేసింది.ఇంకా విడుదల కాకుండానే పైరసీ ఎలా అనుకుంటున్నారా.
తాజాగా మలేషియాలో ప్రీమియర్ షోలు వేయడం జరిగింది.
ఆ సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తులు ఫేస్‌బుక్ లైవ్ ద్వారా సినిమాను లీక్ చేశారు.దాదాపు 50 నిమిషాల వీడియోను లైవ్ పెట్టారు.
దాంతో సినిమా మొయిన్ స్ట్రీమ్ అర్థం అయ్యింది.చిత్ర యూనిట్ సభ్యులు ఆ వీడియోను డిలీట్ చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు.
కాని అప్పటికే పలువురు డౌన్‌లోడ్ చేసుకుని, ఆన్‌లైన్‌లో పెట్టేశారు.దాంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
విడుదల సమయంలో ఆ వీడియోను డిలీట్ చేయించే పని రావడం చిత్ర యూనిట్ సభ్యులకు పెద్ద తలనొప్పిగా మారింది.
సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న సమయంలో ఇలాంటి పైరసీ వీడియోలు బయటకు రావడం ప్రస్తుతం చాలా విచారకరం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.
భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ‘కాలా’ చిత్రంలో రజినీకాంత్ ముంబయి స్లమ్‌లో ఒక డాన్‌గా కనిపించబోతున్నాడు.కబాలి చిత్రంకు కాస్త అటు ఇటుగా ఉంటుందనే విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో సినిమాపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కాని చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం సినిమాపై చాలా నమ్మకంతో ఉన్నారు.వారి నమ్మకం ఎంత మేరకు సక్సెస్ అవుతుందో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.