Movie Title (చిత్రం): కాలా
Cast & Crew:
నటీనటులు: రజనీకాంత్, నానా పటేకర్, హ్యూమా ఖురేషి, ఈశ్వరీరావు, సముద్రఖని, అంజలి పాటిల్, అరవింద్ ఆకాశ్, షాయాజీ షిండే తదితరులుదర్శకత్వం: పా.రంజిత్సంగీతం: సంతోశ్ నారాయణ్నిర్మాత: ధనుష్ (వండర్ బార్ ఫిలిమ్స్, లైకా ప్రొడక్షన్స్)
Story:
తిరునల్ వేలికి చెందిన యువకుడు కరికాలన్(రజనీకాంత్) కొన్ని పరిస్థితుల కారణంగా ముంబై నగరంలోని ధారావి ప్రాంతానికి చేరుకుంటాడు.అక్కడ ప్రజల కష్ట సుఖాల్లో వారికి అండగా నిలబడి వారి నాయకుడుగా ఎదుగుతాడు.అక్కడే జరీనా(హ్యూమా ఖురేషి)తో ప్రేమలో పడతాడు(ప్లాష్ బ్యాక్ ఏపిసోడ్).కానీ ఒక్కటి కాలేకపోతారు.చివరకు కాలా సెల్వి(ఈశ్వరీరావు)ను పెళ్లి చేసుకుంటాడు.
ధారావి ప్రాంతం పేద ప్రజలకు చెందింది.అక్కడున్న హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటారు.
అయితే ఆ ప్రాంతాన్ని ఆధీనం చేసుకోవాలని హరినాథ్ దేశాయ్(నానా పటేకర్) వంటి రాజకీయ నాయకుడు ప్రయత్నిస్తాడు.అయితే ఉన్న చోటును వదలి పేద ప్రజల ఎక్కడికి పోతారు.
అందువల్ల వారు కాలా నాయకత్వంతో ఎదురుతిరుగుతారు.అనుకన్న పని కాకపోతే మన రాజకీయ నాయకులు ఊరుకుంటారా? అక్కడి మనుషుల మధ్య గొడవలు సృష్టిస్తారు.అప్పుడు కాలా ఏం చేస్తాడు? తన ప్రాంత ప్రజలను ఒక్కటి చేసే ఎలా పోరాడుతాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Review:
కరికాలుడు అలియాస్ కాలాగా రజనీకాంత్ తనదైన మాస్ పెర్‌ఫార్‌మెన్స్‌తో ఆకట్టుకున్నారు.కబాలిలో ఫస్టాఫ్‌లో రజనీకాంత్‌ను మాస్ హీరోగా చూపించి.సెకండాఫ్‌లో ఫ్యామిలీ హీరోగా చూపించిన పా.రంజిత్ ఇందులో ఫస్టాఫ్ అంతా ఫ్యామిలీ మేన్‌లా చూపించారు.ఫ్లాష్ బ్యాక్‌లో హ్యూమాతో రజనీకాంత్ ప్రేమ.
విఫలం చెందడం.ఈశ్వరీరావు, రజనీ మధ్య సన్నివేశాలు బావున్నాయి.
రజనీకాంత్‌లాంటి మాస్ హీరోతో ఇలాంటి సినిమా చేయడం గ్రేట్.నానా పటేకర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తనదైన నటనతో నానా క్యారెక్టర్‌లో పరకాయ ప్రవేశం చేసేశాడు.ఎన్‌జి.
ఒ సభ్యురాలుగా హ్యూమా నటన ఆకట్టుకుంటుంది.సముద్రఖని పాత్ర పరిధి మేర చక్కగా ఉంది.
ఇక సాంతికేకంగా చూస్తే మురళి.జి సినిమాటోగ్రఫీ చాలా బావుంది.
మ్యూజిక్ డైరెక్టర్ సంతోశ్ నారాయణ్ సంగీతం, నేపథ్య సంగీతం ఒకే.సినిమాలో రజనీ చేసే ఫ్లై ఓవర్ ఫైట్ సీన్.ఇంటర్వెల్ బ్లాక్ మెప్పిస్తాయి.
Plus Points:
సూపర్‌స్టార్ రజినీకాంత్మెసేజ్ ఓరియెంటెడ్ పా రంజిత్ టేకింగ్బ్రిడ్జ్ఫై వచ్చే ఫైట్ఇంటర్వెల్ బ్లాక్నన పటేకర్
Minus Points:
స్లో నెరేషన్తెలుగు పాటల్లోని సాహిత్యం అసలు అర్థం కావడం లేదు.
Final Verdict:
కాలా….పక్క పైసా వసూల్
Rating: 3.25 / 5