ఈ మధ్య కాలంలో ఈజీ మనీకోసం జనాలు చేయని మోసాలు లేవు.డబ్బు కోసం ఏకంగా మనుషులనే చంపేస్తున్నారు కూడా అయితే సోషల్ మీడియా వేదికని చేసుకుంటూ కూడా ఎన్నో మొసాలు జరుగుతూనే ఉన్నాయి.
అయితే తాజాగా జరిగిన ఒక సంఘటన తో ఒక మహిళా ఒక ఫిలిం ఎడిటర్ అడ్డంగా బుక్కయ్యారు.రాచకొండ డీసీపీ(క్రైం) నాగరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.

చింతల్‌కి చెందిన సలిమిడి నవీన్‌రెడ్డి శ్రేయాస్ మీడియా సంస్థలో ఫిలిం ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు.అయితే అతడికి వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అదే యేడాదినుంచి మరో మహిళ తో చింతల్ శ్రీనివాస్‌నగర్‌లో సహజీవనం చేస్తున్నాడు.ఈ క్రమంలో రెండు కుటుంబాలని నెట్టుకుని రావడం కష్టం కావడంతో సహజీవనం చేస్తున్న మహిళతో కలిసి సోషల్ మీడియాలో ఛాటింగ్‌ల ద్వారా అమాయకులను బుట్టలో పడేసి డబ్బులు కాజేయాలని పథకం పన్నాడు.
అతడి పధకం ప్రకారం నగరానికి చెందిన ఓ వ్యక్తి చాట్ రూం.ఆర్గ్.ఇన్ వెబ్‌సైట్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టగా అతడితో చాటింగ్ చేయించాడు.
ఆమె అతడి మొబైల్ నంబర్ తీసుకుని చాటింగ్ చేయడం ప్రారంభించింది ప్రేమగా మాట్లాడుతూ ముగ్గులోకి దింపి ఆమెకి అత్యవసరంగా 20వేలు కావాలని అడగటంతో వెంటనే పేటీఎం వ్యాలెట్‌లో డబ్బులు వేశాడు.
అయితే ఇది జరిగిన కొన్ని రోజులకే డబ్బులు కావాలనిన్ అతడు ఒత్తిడి తీసుకురాగా విజయవాడలో ఉన్న స్థలాన్ని విక్రయిస్తున్నానని, రిజిస్ట్రేషన్‌కు అవసరమైన రూ.2లక్షలు ఇస్తే మళ్లీ మొత్తం డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెప్పింది…అప్పటికి కూడా కళ్ళు తెరవని సదరు వ్యక్తీ మళ్ళీ ఆమె మాటలు నమ్మి ఆమెకి రూ.1.80లక్షలు బ్యాంకు ఖాతాలో వేశాడు.ఆ మరు నిమిషం ఆమె ఫోన్ నంబర్ పని చేయకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న అతడు సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేశాడు దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇద్దరు నిందితులని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.