అధికారం మీద జనసేనకు ఆశ ఉందని.2019లో ప్రజల సహాయ.సహకారాలతో సరికొత్త ప్రభుత్వం వస్తుందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని.ఉన్న డబ్బులు ఖర్చు పెట్టడానికి రాజకీయాల్లోకి వచ్చానన్నారు.2019 ఎన్నికల్లో తప్పకుండా పోటీలో నిలబడుతామని, 175 స్థానాల్లో పోటీ చేస్తామని
అయన ప్రకటించాడు.శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం వరకు పవన్ నిరసన కవాతు నిర్వహించారు.ఈ కవాతులో జనసేన కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.అనంతరం రాజావారి మైదానంలో భారీ బహిరంగసభలో ఆయన పాల్గొన్నారు.ఈ సభలో ఆయన టిడిపి, బిజెపి పార్టీలపై విమర్శల బాణాలు వదిలారు.

గతంలో టిడిపి.బిజెపి పార్టీలకు మద్దతినిచ్చినప్పుడు నేను ఎటువంటి పదవి కోరుకోలేదని.ఏ కాంట్రాక్టర్ అవసరం లేదన్నారు.600 పైకి ఎక్కువగా హామీలు టిడిపి మెనిఫెస్టోలో ఉన్నాయని.ఈ విషయాన్ని తాను ప్రశ్నించానని.తనను నమ్మాలని బాబు నాకు చెప్పాడన్నారు.పార్లమెంట్ హాల్ లోకి వెళ్లేముందు మెట్లు మొక్కిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీ ఆశలను.ఆశయాలను నెరవేరుస్తానని నమ్మకం కలిగిందన్నారు.
కానీ ఆ నమ్మకం ఇప్పుడు కలగడం లేదని పవన్ చెప్పారు.
నాకు , నా పార్టీకి ఒక విధానం అంటూ లేదని కొంతమంది విమర్శిస్తున్నారు చంద్రబాబు కూడా టీడీపీ ని స్థాపించలేదు ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో చేరి ఇప్పుడు ఈ స్థితికి వచ్చాడని .కానీ నాకు అటువంటి పరిస్థి లేదని అలాగే నాకు హెరిటేజ్ వంటి సంస్థ కూడా లేదని పవన్ సీఎంపై వ్యంగ్యాస్త్రాలు వదిలారు.నాకు సీఎం పీఠం కంటే ముందు ప్రజల సమస్యలు తెలుసుకోవాలనే ఆరాటం ఎక్కువగా ఉందని అందుకే యాత్రలు చేపట్టానని అయన అన్నారు.
టిడిపి ఇచ్చిన హామీల విషయాలపై తాను గతంలో ప్రశ్నించానని, దీనికి కాలయాపన చేశారని తెలిపారు.రెండు సంవత్సరాల తరువాత వారు మోసం చేస్తారని గ్రహించినట్లు తెలిపారు.
సపోర్టు చేస్తే బానిసల్లాగా ఉండాలా ? అంటూ పవన్ ఎదురు ప్రశ్నించారు.అందిరిలాగా తాను ప్రజలను మోసం చేయనని.
నిజాయితిగా ఉంటానని.వెనుకంజ వేయనని తెలిపారు.
అధికారం మీద జనసేనకు ఆశ ఉందని ఖచ్చితంగా రాబోయేది జనసేన ప్రభుత్వమే అని పవన్ ధీమా వ్యక్తం చేసారు.