బాబు మహేష్‌.. ప్లీజ్‌ అలా వద్దు

బ్లాక్‌ బస్టర్‌ ‘భరత్‌ అనే నేను’ చిత్రం తర్వాత మహేష్‌బాబు చేయబోతున్న సినిమాపై అందరి అంచనాలున్నాయి.పైగా మహేష్‌బాబుకు 25వ సినిమా అవ్వడం వల్ల కూడా అంచనాలు రాబోతున్న సినిమాపై భారీగా ఉన్నాయి.

 Pls Mahesh Babu Dont Do That-TeluguStop.com

వంశీ పైడిపల్లి ఒక విభిన్నమైన కథాంశంతో మహేష్‌ 25వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దం అయ్యాడు.అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపు ఆరు నెలలుగా అవుతూనే ఉంది.

ఇటీవలే ఈ సినిమా నటీనటుల ఎంపిక పూర్తి అయ్యింది.త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుంది.

ఈ సమయంలోనే మహేష్‌బాబు సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో మరియు వెబ్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇప్పటి వరకు మహేష్‌బాబు నటించిన 24 సినిమాల్లో ఏ ఒక్క సినిమాలో కూడా మీసకట్టుతో కనిపించలేదు.ఇటీవలే విడుదలైన భరత్‌ అనే నేను చిత్రంలో మారువేశంలో బయట తిరగడం కోసం మీసం పెట్టుకుని కనిపించాడు.మీసం పెట్టుకుంటే మహేష్‌బాబును సినిమాలోనే కాదు బయట కూడా గుర్తించడం కష్టం.

ఎందుకంటే మహేష్‌ను ఎన్నో సంవత్సరాలుగా మీసాలు లేకుండా మాత్రమే మనం చూస్తూ వస్తున్నాం.ఇప్పుడు మీసాలతో చూడమంటే ఇబ్బందని చెప్పక తప్పదు.

మహేష్‌బాబు అంటే ఒక రకమైన అభిప్రాయంలో ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు ఉంటారు.అందుకే అలాంటి వారు ఈ కొత్త లుక్‌లో మహేష్‌బాబును చూడటం కష్టం.

మహేష్‌బాబును దర్శకుడు వంశీ పైడిపల్లి కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.అందులో భాగంగానే మహేష్‌బాబును బలవంతంగా ఒప్పించి మరీ మీస కట్టుతో చూపించబోతున్నారు.మహేష్‌బాబును మీస కట్టుతో చూడాలని ఏ ఒక్క అభిమాని కాని ప్రేక్షకులు కాని కోరుకోడం లేదు.పైపెచ్చు అలా కనిపిస్తే బాబోయ్‌ అనేస్తారే తప్ప అబ్బ బాగున్నాడే అని మాత్రం అనుకోరు.

అందుకే వంశీ పైడిపల్లి చేసే ప్రయోగం విఫలం అవ్వడమే ఎక్కువ ఛాన్స్‌ ఉందని అంటున్నారు.

మహేష్‌బాబును మహేష్‌బాబులాగే చూపించాలి కాని మరో విధంగా చూపిస్తానంటే ఫ్యాన్స్‌ ఒప్పుకునే పరిస్థితి లేదు.

ఈ వయస్సులో కూడా మహేష్‌ ఇంత అందంగా కనిపిస్తున్నాడు అంటే ఆయన ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు.అలాంటి ప్రత్యేకతను పోగొట్టి, మీస కట్టుతో చూపించే ప్రయత్నం చేయడం ఏమాత్రం సమంజసం కాదు అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరి వంశీ పైడిపల్లి తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటాడా లేదంటే మహేష్‌బాబును తాను అనుకున్నట్లుగానే చూపిస్తాడా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube