చిన్నల్లుడు మహా స్పీడ్‌గా ఉన్నాడు.. మరి ఇదెందుకు ఆలస్యం?

మెగాస్టార్‌ ఫ్యామిలీ నుండి ఎంత మంది హీరోలు ఉన్నారు అంటే ఠక్కున సమాధానం చెప్పడం కష్టం.ఎందుకంటే లెక్కకు వెంటనే అందనంత మంది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నారు.

 Chiranjeevis Daughter Sreeja Husband Movie-TeluguStop.com

చిన్న పెద్ద మెగా హీరోలందరిని కలుపుకుంటే దాదాపు డజనుకు అటు ఇటుగా ఉంటారు.ఇంకా కూడా మెగా ఫ్యామిలీ సభ్యులు ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు సిద్దం అవుతున్నారు.

ఇక చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్‌ దేవ్‌ ఇటీవలే ఒక సినిమాను ప్రారంభించాడు.హీరో అవ్వాలనే కోరికతోనే ఈయన చిరంజీవి ఇంటి అల్లుడు అయ్యాడు అంటూ ప్రచారం జరిగింది.

అందరు అనుకున్నట్లుగానే కాస్త గ్యాప్‌ తీసుకుని కళ్యాణ్‌ హీరోగా తెరంగేట్రం చేశాడు.

మెగా వ్యూహమో మరేంటో కాని భారీ చిత్రంగా కాకుండా ఒక చిన్న చిత్రంగా కళ్యాణ్‌ మొదటి సినిమా తెరకెక్కింది.రాకేశ్‌ శశిక దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది.ఇటీవలే ఈ సినిమాను పూర్తి చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.

తాజాగా ఈ సినిమాకు డబ్బింగ్‌ కార్యక్రమాలు కూడా మొదు అయ్యాయి.అతి త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తామంటూ నిర్మాత సాయి కొర్రపాటి ప్రకటించాడు.

అంతా బాగానే ఉంది కాని ఒక్క విషయంలో ప్రేక్షకుల మరియు మెగా ఫ్యాన్స్‌ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా అంతా పూర్తి అయ్యింది, డబ్బింగ్‌ కూడా మొదలు అయ్యింది.

మరి కొన్ని రోజుల్లో సినిమాను విడుదల చేస్తామంటున్నారు, కాని సినిమా టైటిల్‌ మాత్రం ఇంకా ఖరారు చేయలేదు.ప్రస్తుత కాలంలో సినిమాను ఎలా తెరకెక్కించాం అనేదానికంటే ఎంతగా పబ్లిసిటీ చేశాం అనేది ముఖ్యం.

అందుకే సినిమా టైటిల్‌ను మొదటే ఖరారు చేసి సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను మొదటి నుండి చేస్తూనే ఉన్నారు.కాని కళ్యాణ్‌ సినిమాకు మాత్రం ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు.

సినిమాకు సంబంధించిన ఎలాంటి ఆసక్తికర విషయాలను తెలియజేయలేదు.

ఒక సినిమా షూటింగ్‌ సగం పూర్తికాగానే ఒక టీజర్‌ను సినిమా పూర్తి అయిన తర్వాత మరో టీజర్‌ను, సినిమా విడుదలకు ముందు ఆడియో విడుదల సమయంలో ట్రైలర్‌ను విడుదల చేయడం జరుగుతుంది.

కాని వాటన్నింటికి భిన్నంగా ఈ సినిమా ఉంది.ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన కనీసం ఒక్క స్టిల్‌ కూడా బయటకు రాలేదు.

సాయి కొర్రపాటి కావాలని ఇలా చేస్తున్నాడంటూ కొందరు అంటున్నారు.కళ్యాణ్‌ లుక్‌ను రివీల్‌ కానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు.

అతి త్వరలోనే టీజర్‌, ట్రైలర్‌తో పాటు టైటిల్‌ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అప్పటి వరకు కాస్త ఓపిప పట్టండి అంటూ సాయి కొర్రపాటి అభిమానులకు సూచిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube