పాదాలు మృదువుగా ఉండటానికి అద్భుతమైన చిట్కాలు

మన రోజువారీ పనుల కారణంగా శరీరంలో ఇతర భాగాలు కన్నా పాదాలు కాస్త పొడిగా ఉంటాయి.పాదాలు పొడిగా కాకుండా కాస్త తేమగా ఉండాలంటే తప్పనిసరిగా మాయిశ్చరైజర్ ని ఉపయోగించాలి.

 The Best Natural Moisturisers For Smooth Feets Details, Natural Moisturisers ,sm-TeluguStop.com

ఈ మాయిశ్చరైజర్ లను ఉపయోగించటం వలన పాదాల చర్మం మృదువుగా మారి చూడటానికి చాలా అందంగా ఉంటుంది.ఇప్పుడు పొడి చర్మం కోసం సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ లను ఎలా ఉపయోగించాలో తెలుస్కుందాం.

కొబ్బరినూనె కాళ్ళను, పాదాలను మృదువుగా ఉంచటానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.కొబ్బరి నూనె పాదాలకు, కాళ్లకు రాసి 5 నిముషాలు మసాజ్ చేస్తే చర్మ గ్రంధులు లోపలకు వెళ్లి మరీ దాని ప్రభావాన్ని చూపుతుంది.

ఆముదం నూనె పొడి తత్త్వం ఉన్నవారికి బాగా సహాయపడుతుంది.ఈ నూనెలో కొవ్వు ఆమ్లాలతో పాటు ఇతర ముఖ్యమైన పోషకాలు ఉండుట వలన పాదాల చర్మాన్ని తేమగా, మృదువుగా ఉంచుతుంది.

బాదం పప్పును తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కాలుగుతాయని మనకు తెలుసు.అయితే బాదం నూనె మేజిక్ లా పనిచేసి పాదాలు, కాళ్ళను మృదువుగా, తేమగా ఉంచుతుంది.ఆలివ్ ఆయిల్ లో మీ చర్మానికి పోషణను అందించి, మెరిసేటట్లుగా, కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా మీ చర్మాన్ని ఉంచే విటమిన్-E చాలా సమృద్ధిగా ఉంటుంది.మీరు ప్రతిరోజూ ఈ నూనెను మీ కాళ్ళకు రాసి 5 నిముషాలు మసాజ్ చేస్తే మృదువైన కాళ్ళు మీ సొంతం అవుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube