మహేష్‌, కొరటాల ఇద్దరు గొప్పోల్లే!!

మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భరత్‌ అనే నేను’ భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకు పోతుంది.కేవలం మొదటి వారం రోజుల్లోనే ఏకంగా 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం టాలీవుడ్‌ నెం.3 దిశగా దూసుకు పోతుంది.భారీ ఎత్తున విడుదల అయిన ఈ చిత్రం మరోసారి మహేష్‌ సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ను కాపాడటం జరిగింది.

 Mahesh Babu Praises Koratala Siva-TeluguStop.com

బ్రహ్మోత్సవం మరియు స్పైడర్‌ చిత్రాలతో భారీ డిజాస్టర్‌లు చవి చూసిన మహేష్‌బాబు ఈ చిత్రం విజయంతో మళ్లీ తేరుకున్నాడు.

గతంలో కూడా ‘శ్రీమంతుడు’ చిత్రంతో మహేష్‌బాబుకు దర్శకుడు కొరటాల శివ భారీ విజయాన్ని ఇచ్చాడు.ఆ సమయంలో కూడా మహేష్‌బాబుకు చాలా హెల్ప్‌గా నిలిచాడు.తాజాగా ఈ చిత్రంతో మరోసారి మహేష్‌బాబు స్టార్‌డంను కాపాడాడు.

ఆ విషయాన్ని స్వయంగా మహేష్‌బాబు చెప్పుకొచ్చాడు.తాను కష్టంలో ఉన్న సమయంలో దర్శకుడు కొరటాల శివ రెండు సార్లు లైఫ్‌ ఇచ్చాడు అంటూ చెప్పుకొచ్చాడు.

ఒక స్టార్‌ హీరో అయ్యి ఉండి కేవలం నాలుగు సినిమాలు చేసిన దర్శకుడి గురించి అలా మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు.తాజాగా మహేష్‌బాబు చేసిన వ్యాఖ్యలపై కొరటాల శివ స్పందించాడు.

మహేష్‌ బాబు వ్యాఖ్యలను తాను అంగీకరించడం లేదని, ఆయన స్థాయికి తాను సక్సెస్‌ ఇచ్చి, లైఫ్‌ ఇచ్చేంతటి వాడిని కాదు అంటూ చెప్పుకొచ్చాడు.మహేష్‌బాబుకు ప్రతి సీన్‌ కూడా కొత్తగా ఉండాలని కోరుకుంటారు.

అందుకే ప్రతి సీన్‌కు ఎంతో కష్టపడతారు.అలాంటి మహేష్‌ తన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రయోగాత్మకంగా చేయాలని భావిస్తాడు.

అందులో భాగంగానే కొన్ని ప్రయోగాలు చేసి విఫలం అవ్వడం జరుగుతుంది.

ప్రయోగాలు చేసినప్పుడు విఫలం అవ్వడం అనేది సర్వ సాధారణం.

అలా అని వారిని తప్పుపట్టలేం అంటూ కొరటాల శివ చెప్పుకొచ్చాడు.అంటే కొరటాల శివ ప్రకారం మహేష్‌బాబు ఒక గొప్ప నటుడు అని, ఆయన తన ప్రతి సినిమా కూడా గొప్పగా ఉండాలని భావించి ప్రయోగం చేస్తాడని అర్థం.

మహేష్‌బాబు, కొరటాల ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకోవడం చూస్తుంటే ఇద్దరు కూడా గొప్పవారే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.ఇద్దరు కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం కలిగి ఉన్నారు అని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube