వేసవిలో దోసకాయతో చర్మ సంరక్షణ ఎలా చేయాలో తెలుసా?

వేసవికాలం వచ్చిందంటే అనేక రకాల చర్మ సమస్యలు వచ్చేస్తాయి.వాటిని తగ్గించుకోవటానికి ఎటువంటి క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు.

 Cucumber Skin Benefits Details, Cucumber, Skin Care Tips, Cucumber For Skin, Cle-TeluguStop.com

వేసవిలో చర్మ సమస్యలకు దోసకాయ అద్భుతంగా పనిచేస్తుంది.దోసకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు,ఖనిజాలు,విటమిన్స్ చర్మంపై ట్యాన్, మచ్చలు, పొడిచర్మం వంటి సమస్యలను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

ఇప్పుడు దోసకాయను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

దోసకాయను తురిమి దానిలో తేనే కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేస్తే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేయాలి.

రెండు స్పూన్ల దోసకాయ రసంలో ఒక స్పూన్ మీగడ కలిపి ముఖానికి పట్టించి 15 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేయటం వలన చర్మంలో పొడితనాన్ని తగ్గించి తేమగా ఉండేలా చేస్తుంది.అంతేకాక చర్మం మృదువుగా మారుతుంది.

Telugu Butter Milk, Clear Skin, Cucumber, Cucumber Skin, Face, Tips, Skin Care T

మూడు స్పూన్ల దోసకాయ రసంలో రెండు స్పూన్ల శనగపిండి, ఒక స్పూన్ మజ్జిగ, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి రాసి 15 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయటం వలన ముఖంపై జిడ్డు తొలగిపోయి చర్మం యవ్వనంగా కన్పిస్తుంది.

ఒక స్పూన్ దోసకాయ రసంలో ఒక స్పూన్ పెరుగు,ఒక స్పూన్ గుడ్డు తెల్లసొన కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే చర్మంపై ట్యాన్ తొలగిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube