మన దేశంలో ఉలవల గురించి తెలియని వారు ఎవరు లేరు.అయితే ఉలవలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు.
మన తెలుగువారికి ఉలవలతో తయారుచేసే చారు అంటే చాలా ఇష్టం.ఒక్కసారి ఉలవచారు తింటే ఆ రుచిని జన్మలో మర్చిపోలేరు.
ఉలవచారు అంత రుచిని కలిగి ఉంటుంది.అయితే ఉలవలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.
ఉలవలను తరచుగా తీసుకుంటూ ఉంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.ఇప్పుడు ఉలవలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఉలవల్లో ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన శరీరానికి పోషణ అందుతుంది.ఉలవల్లో ఉండే ఫైబర్ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను,రక్తపోటును తగ్గించటానికి సహాయపడుతుంది.
మలబద్దకం సమస్య ఉన్నవారు ఉలవచారును భోజనంలో తీసుకుంటే ఆ సమస్య నుండి బయట పడతారు.
ఉలవల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండడం వల్ల ఎదిగే పిల్లల్లో శరీర నిర్మాణానికి బాగా సహాయపడుతుంది.
ఉలవలను రెగ్యులర్ గా తీసుకుంటే ఆకలి పెరగటమే కాకుండా మూత్ర పిండాలు, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లు కరిగిపోతాయి.
అధిక బరువు ఉండేవారికి ఉలవలు ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు.
ఉలవల్లో ఉండే లక్షణాలు శరీరంలో కొవ్వును తగ్గించటంలో సహాయపడతాయి.ఒక కప్పు ఉలవలకు నాలుగు కప్పుల నీటిని పోసి కుక్కర్ లో పెట్టి ఉడికించాలి.
ఈ నీటిని వడకట్టి చిటికెడు ఉప్పు కలిపి ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో త్రాగితే బరువు తగ్గుతారు.
ఉలవలను కొంచెం వేగించి ఒక క్లాత్ లో పోసి మూట కట్టి నొప్పి ఉన్న ప్రదేశంలో కాపడం పెడితే నొప్పులు మరియు వాపులు తగ్గిపోతాయి.