మొల‌కెత్తిన గింజ‌లను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

మొలకెత్తిన గింజలలో ప్రోటీన్లు, విటమిన్స్, మినరల్స్ వంటి పోషక విలువలు సమృద్ధిగా ఉండి మన ఆరోగ్యానికి చాలా మేలును చేస్తాయి.వీటిని ఇంటిలోనే సులభంగా తయారుచేసుకోవచ్చు.

 Health Benefits Of Sprouts Telugu-TeluguStop.com

ప్రతి రోజు ఒకే రకానికి చెందిన మొలకలు తినటం కన్నా రెండు మూడు రకాల మొలకలను తింటే మంచిదని నిపుణులు అంటున్నారు.అప్పుడు మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.

మ‌రి ఏయే మొల‌కెత్తిన గింజ‌ల‌తో ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ముందుగా మొలకలు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

గింజలను 10 నుంచి 12 గంటలపాటు నానబెట్టి శుభ్రంగా కడగాలి.గింజల్లో నీరు లేకుండా వడకట్టి పొడి క్లాత్ లో పోసి గట్టిగా చుట్టి ఉంచాలి.

ఒక రోజులో మొలకెలు వస్తాయి.మొలకలు వచ్చిన వాటిని తీసేసి, మరల మొలకలు రాని గింజలను మూట కట్టాలి.

వీటిని ఫ్రిడ్జ్ లో పెడితే వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి.అయితే రెండు రోజులకు ఒకసారి నీటిని చల్లాల్సి ఉంటుంది.

శనగలు
వంద గ్రాముల శనగల్లో 115 క్యాలరీల శక్తి, 7.2 గ్రాముల ప్రోటీన్లు, 16.1 గ్రాముల కార్బొహైడ్రేట్లు, 2.9 గ్రాముల కొవ్వు పదార్థాలు, ఫైబర్ ఉంటాయి.ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన రక్తంలో హానికరమైన కొవ్వులు తగ్గిపోతాయి.అధిక మోతాదులో ప్రోటీన్లు లభించటం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.రక్త ప్రసరణ పెరుగుతుంది.వీటిలోని ప్రత్యేక పదార్థాలు నిద్ర రావడానికి సహాయపడతాయి.

పెసలు
మొలకెత్తిన పెసలలో విటమిన్ ఎ, సిలు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి.100 గ్రాముల పెసర్లతో 105 కిలోక్యాలరీల శక్తి, 0.38 కొవ్వు పదార్థాలు, 7.02 ప్రోటీన్లు, 7.7 గ్రాముల పీచు పదార్థాలు లభిస్తాయి.మొలకెత్తిన పెసల్లో ప్రోటీన్లు అధికంగా ఉండడం వలన చురుకుదనం, మానసిక శక్తి పెరుగుతుంది.

పాస్ఫరస్ తగినంత ల‌భించ‌డం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.పీచు పుష్కలంగా ఉండడంతో రక్తంలోని కొవ్వు క‌రిగిపోతుంది.

అలాగే జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి.

రాగులు
రాగుల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి.ప్రోటీన్లు, క్యాల్షియం, ఐరన్‌లు సమృద్ధిగా ఉంటాయి.100 గ్రాముల రాగి మొలకల్లో 7.3 గ్రాముల ప్రోటీన్లు, 1.3 గ్రాముల కొవ్వు పదార్థాలు, 3.44 గ్రాముల కాల్షియం, 3.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది.వీటితో 328 కిలోక్యాలరీల శక్తి లభిస్తుంది.కీళ్ల నొప్పులు ఉన్నవారికి చాల సహాయపడతాయి.బలహీనంగా ఉన్న ఎముకలకు బలాన్ని ఇస్తాయి.పెరిగే పిల్లలకు మొలకెత్తిన రాగులు పెరుగుదలలో దోహదపడతాయి.

మెంతులు
మొలకెత్తిన మెంతుల్లో ఫైబర్ 25 గ్రాములు, ప్రోటీన్లు 23 గ్రాములు, ఐరన్ 33.53 మిల్లీగ్రాములు, అమైనో యాసిడ్స్ 300 గ్రాములు ఉంటాయి.మొలకెత్తిన మెంతులను తినటం వలన జలుబు, ఆస్తమా, గొంతు సమస్యలు దూరమవుతాయి.గ్యాస్ట్రిక్, మధుమేహం సమస్యలు ఉన్నవారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.మొలకలొచ్చిన మెంతుల పేస్ట్ ని స్నానానికి ముందు తలకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube