సాయిధరమ్ తేజ్ కధానాయకుడిగా కరుణాకరన్ దర్శకత్వంలో ఒక ప్రేమకథ చిత్రంలో నటిస్తున్నాడు.తేజు ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ తొలిసారి అనుపమ పరమేశ్వరన్ తో రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.కరుణాకరన్ మంచి ప్రేమకథలు స్పెషలిస్ట్.
అందువలన ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
అయితే మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వరుస పరాజయాలు చవి చూసి, ఒకవిధంగా డిప్రెషన్ లోనే ఉన్నాడు.
ఇలాంటి సమయంలో చిన్న మామయ్య పవర్ స్టార్ సహకారం ఉంటే, తన సినిమాకు,కెరీర్ కు మరింత బలం చేకూరుతుందని, తన సినిమా ఆడియో ఫంక్షన్ కి పవన్ ని రప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడట.ఆడియో ఫంక్షన్ కి ఇంకా సమయం ఉన్నా, పవన్ తన పొలిటికల్ కమిట్మెంట్స్ మూలంగా, తేజు ఈ కోరికను నెరవేరుస్తాడ అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న.
అజ్ఞాతవాసి చిత్రం తరువాత,పవన్ మరో సినిమాకు ఒప్పుకోలేదు.పలు నిర్మాణ సంస్థలతో సినిమా చేస్తానని ఒప్పందం కుదుర్చుకుని ఉన్నాడు.
కాని ఇప్పుడు జనసేన అధిపతిగా పూర్తిగా రాజకీయాలతో బిజీగా ఉండటం కారణంగా ఇంకొక సినిమా అయన నుంచి ప్రస్తుతం ఆశించడం కష్టమే అని అంటున్నారు సినీ వర్గాలు.మేనల్లుడిని ప్రోత్సహించి సినిమాల్లోకి తీసుకొచ్చిందే పవన్ కాబట్టి, మరోసారి బరోసా ఇవ్వడానికి పవన్ తన అభయ హస్తాన్ని మేనల్లుడి పై వేస్తాడనే అంటున్నారు పవన్ అభిమానులు.
ఏది ఏమయినా త్వరలోనే సినిమాకి సంబందించిన వివరాలు తెలియనున్నాయి.అప్పటిదాకా వేచి చూడాల్సిందే.