అద్దాలు,కిటికీలు,సిరామిక్ టైల్స్ వంటి వాటి మీద మరకలు పడుతూ ఉంటాయి.టీ డికాషన్ తో తుడిస్తే మరక మాయం అవుతుంది.
కార్పెట్ మీద ఏమైనా పడినప్పుడు వాసన వస్తూ ఉంటుంది.ఆ వాసన పోవాలంటే వాసన వచ్చే ప్రదేశంలో టీ పొడి జల్లి పది నిమిషాల తర్వాత దులిపేసి అరగంట ఎండలో ఉంచితే సరిపోతుంది.
నీటిలో టీ పొడిని వేసి మరిగించి డికాషన్ తయారుచేయాలి.ఈ డికాషన్ తో తలస్నానము చేస్తే మంచి కండిషనర్ గా పనిచేస్తుంది.
జుట్టు అవసరమైన తేమ,పోషణ కలిగి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
ఎండలో ఎక్కువగా తిరగటం వలన ముఖం నల్లగా కమిలినట్టు ఉంటుంది.కమిలిన ప్రదేశంలో టీ బ్యాగ్ ని నీటిలో ముంచి పెడితే మంచి ఉపశమనం కలగటమే కాకుండా చర్మం తాజాగా ఉంటుంది.
కారులో సువాసన కోసం ఫ్రెషనర్స్ పెడుతూ ఉంటాం.
వాటికీ బదులుగా రెండు టీ బ్యాగ్ లను పెడితే కారులో చెడు వాసన అంతా పోతుంది.ఈ బ్యాగ్ లను వారానికి ఒకసారి మార్చుతూ ఉండాలి.
ఫ్రిజ్ లో కూరగాయల వాసన వస్తుందా… ఆ వాసన పోవాలంటే ఫ్రిజ్ లో రెండు టీ బ్యాగ్ లను పెడితే ఆ వాసన పోతుంది.