చంద్రబాబు కి కోపం వచ్చింది.అదేంటి ఎప్పుడు కోపంగానే ఉంటాడుగా ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా కోపం అంటే మామూలు కోపం కాదు మంత్రులని కొట్టలేదు కర్ర పుచ్చుకుని అంతే.
అది తప్ప మిగిలిన అంతా చేశారు అని అంటున్నారు అసలు ఏమి జరిగింది.బాబు ఎందుకు అంతలా కోపం వచ్చింది అంటే.
మొత్తం మీరే చేశారు అంటూ ఎమ్మెల్యేలు అందరు మత్రులవైపు చేతులు చుపిస్తున్నారట.మధ్యలో ఈ ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచీ వచ్చారు బాబోయ్ ఇదేం కన్ఫ్యూజన్.
అసలు విషయం తెలియాలంటే.
మంత్రులపై చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారట…ఒకరిద్దరిపై కాదు మొత్తం అందరి మంత్రులపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారట బాబు…దాంతో మంత్రులకి ఏమి చేయాలో తెలియక మా బాబు కాదు అంటూ బ్రతిమిలాడాలని చుసిన గ్యాప్ కూడా ఇవ్వకుండా దంచేశారట.
ఇంతకీ మంత్రులపై చంద్రబాబుకు అంత కోపం ఎందుకొచ్చినట్లు? అంటే…మంగళవారం రాత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీ నేతల సమన్వయ సమావేశం జరిగింది.ఆ సందర్భంగా పలువురు మంత్రులపై సిఎం మండిపడ్డారట.
చాలామంది మంత్రులు వివిధ జిల్లాలకు ఇన్చార్జి మంత్రులుగా వ్యవహరిస్తున్నారు.అయితే, తాము ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్న జిల్లాల్లో తమ వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకుంటూ మిగిలిన విషయాలను గాలికొదిలేస్తున్నారట.
అంతేకాదు పూర్తిగా ఎమ్మెల్యేలు ,ఎంపీ లు తదితరులని పక్కన పెట్టేస్తున్నారు…పార్టీకి, ప్రభుత్వానికి మద్య సమన్వయం చేయలేకపోతున్నారట…దాంతో జిల్లాల వారిగా ఉన్న సమస్యలు మొత్తం పేరుకు పోయాయని దానికి నిదర్సానమే ప్రకాశం, విశాఖపట్నం, కర్నూలు, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాలు అని తెలిపారట.దానికితోడు ఇన్చార్జి మంత్రులు కూడా పట్టించుకోవటం లేదు.
ఆ విషయం మీదే చంద్రబాబు మంత్రులపై మండిపడ్డారు.అయితే అసలు వర్గాలని పెంచి పోషించేది బాబు మరి అలాంటప్పుడు మమ్మల్ని తిడ్డటం ఏమిటి అంటూ లోలోపల గొణుక్కుంటున్నారట బాబు.