తెలుగు రాష్ట్రాల గవర్నర్ మీద విమర్శలు మారు మోగుతున్నాయి.గవర్నర్ మీద కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వానికి గవర్నర్ కొమ్మి కాస్తున్నారు అంటూ ఫైర్ అవుతున్నారు కాంగీ నాయకులు.ఇప్పుడు తెలంగాణలో గవర్నర్ విషయమే హాట్ టాపిక్.
గవర్నర్ పక్కా టీఆర్ఎస్ లీడర్ లా వ్యవహరిస్తున్నారు.కేసీఆర్ భజన చేయడానికి కారణం ఏంటో చెప్పండి అంటూ మండిపడుతున్నారు.
ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌గా ఉన్న నరసింహన్ తెలంగాణ ప్రభుత్వానికి.సీఎం కేసీఆర్.ఆయన కుమారుడు కేటీఆర్‌లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని.అసలు ప్రభుత్వం చేయవలసిన పనులు చేస్తోంది అభినందించవచ్చు కానీ టీఆర్ఎస్ నాకుల్ని మించి మరీ ఓ కార్యకర్తలా గవర్నర్ మాట్లాడటం మంచి పద్దతి కాదని విమర్శించారు కాంగ్రెస్ నేతలు.
ఇప్పటికే గవర్నర్ పై సర్వ్ సత్యనారాయణ లాంటి నేతలు ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే.తాజాగా సర్వేని “ఫెలో” అంటూ మాట్లాడటం మరిన్ని విమర్సలకి దారి తీసింది.
ఏ రాష్ట్ర గవర్నర్ అయినా అటు అధికార, ఇటు విపక్ష పార్టీల నేతలకు సమాన గౌరవం ఇవ్వాల్సి ఉంది.అయితే,.నరసింహన్ మాత్రం ఆ సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు.ఈ క్రమంలో తాజాగా గవర్నర్ వ్యవహరించిన తీరు మరింత వివాదాస్పదం అయింది.
తెలంగాణా సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును గవర్నర్ నరసింహన్ ఇటీవల సందర్శించారు అయితే ఇక్కడ గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేరును కాళేశ్వరం చంద్రశేఖర్ రావుగా మార్చాలని.సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు పేరును కూడా కాళేశ్వరరావుగా పిలవాలని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు ఈ వ్యాఖ్యలే తెలంగాణాలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.ఇప్పటికే ఈ విషయంలో కాంగీ కాకరేపుతుంటే.
కోదండరాం కూడా గవర్నర్ వ్యాఖ్యలపై విస్మయం చెందారని తెలుస్తోంది.








