తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఇద్దరు ఫైర్ బ్రాండ్లు ఒకరు తెలంగాణా ముఖ్యమంత్రికి సీటు కింద మేకులా ఉంటే మరొకరు చంద్రబాబు కి ప్రతిపక్షం కంటే కూడా మిత్ర పక్షంలో ఉంటూ పుండు మీద ఈగలా రచ్చ రచ్చ చేస్తున్నారు.వాళ్ళు ఎవరో కాదండి.
కేసీఆర్ కి రేవంత్ మొగుడులా మారితే.చంద్రబాబు కి మిత్రపక్షం ఎమ్మెల్సీ సోము వీర్రాజు మొగుడై కూర్చున్నాడు…వీళ్ళ ఇద్దరు ఈ ఇద్దరు మంత్రులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
పదునైన మాటలతో వాళ్ళు చేసే కామెంట్స్ ముఖ్యమంత్రులకి బీపీ హైప్ చేస్తున్నాయి.
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గుజరాత్ ఎన్నికల తరువాత చంద్రబాబు పై ఎలా రెచ్చిపోయారో అందరికీ తెలిసిన విషయమే.
ప్రతిపక్షానికంటే ధీటుగా సోము ఫైర్ అవుతూ ఫైర్ బ్రాండ్ టైటిల్ కొట్టేశారు.నిన్నా మొన్నటి వరకూ బీజేపి పై కామెంట్స్ చేయని టిడిపి తాజాగా విజయనగరం టిడిపి ఎంఎల్సీ చేసిన వ్యాఖ్యలతో హామీ తుమీ తేల్చుకోవడానికి సిద్దం అయ్యింది అని తెలుస్తోంది.
అయితే ఆ వ్యాఖ్యలకి సోము ఇచ్చిన కౌంటర్ తో బాబు పరువు పోయింది అనే చెప్పాలి…ఇంతకీ సోము ఏమన్నారంటే
ఎన్టీఆర్ టిడిపి పెట్టినపుడు చంద్రబాబు కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే ఎన్టీఆర్ పైనే పోటీ చేస్తానని చెప్పిన విషయాన్ని మేము ఎక్కడైనా ప్రస్తావించామా…కాంగ్రెస్ తరపున పోటీ చేసిన చంద్రబాబుకు డిపాజిట్ కూడా దక్కలేదు మరి మేము ఈ విషయం ఎక్కడా చెప్పలేదు కదా అంటూ అన్ని విషయాలు చెప్తూనే చంద్రబాబు పరువు తీసేశారు.
తమకు మిత్రపక్షంగా ఉంటూనే టిడిపి ఎందుకు తమపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తోంది అంటూ చంద్రబాబు పైనే కౌంటర్ వేశాడు సోము.
రాష్ట్రంలో భాజపా ఎదగడం టిడిపికి ఇష్టం లేదని మాకు అర్థం అవుతోందని అన్నారు.
అమరావతిపై దృష్టి పెట్టిన చంద్రబాబు రాయలసీమ జిల్లాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు…పోలవరంపై చంద్రబాబు దృష్టి పెడుతున్నట్లు మిగిలిన ప్రాజెక్టులపై ఎందుకు పెట్టటంలేదు.రాజధానిని డిజైన్లకే పరిమితం చేశారు అంటూ మండి పడ్డారు.
ఎన్నికల్లో టికెట్స్ విషయంలో అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి తరువాత పొగ బెడుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు ఏపీ ఫైర్ బ్రాండ్ సోము.అయితే సోము బాబు పై చేసిన ఈ వ్యాఖ్యలకి టిడిపి నేతలు బాబు ఆదేశాల కోసం ఎదురు దాడి చేయడానికి సిద్దంగా ఉన్నారు మరి బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.







