వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్స్ ఈ “ఐదుగురికీ లేవంట”

ఏపీలో ఇప్పటి వరకూ ఎన్నడు లేని విధంగా ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది.రాజకీయ నాయకుల నుంచీ ఓటు వేసే ప్రతీ ఓటరుకు ఈ ఎన్నికల కోసం ఎంతో ఉత్ఖంటగా వేచి చూస్తున్నారు.

 Five Sitting Mla’s May Not Get Tickets For Next Elections-TeluguStop.com

అయితే బిజెపి కూడా అన్ని రాష్ట్రాల ఎన్నికల కంటే కూడా ఏపీ మీద ఎక్కువగా దృష్టి పెట్టింది అనే చెప్పాలి.ఒక పక్క ఈ సారైనా సరే అధికారంలోకి రావాలని జగన్ మోహన్ రెడ్డి వేచి చూస్తూ ఉంటే.

ఈ సారి కూడా అధికారాన్ని చేజిక్కించు కోవాలని టిడిపి ప్లాన్స్ వేస్తోంది.మరో పక్క కొత్తగా వచ్చిన జనసేన.

ఓట్లను చీల్చడానికి సిద్దం అంటోంది.ఏపీలో ఇప్పుడు ఉన్న ఈ త్రిముఖ పోరు మాత్రం ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇదిలా ఉంటే.ప్రతీ పార్టీ కూడా అభ్యర్ధుల విషయంలో ఎంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి…వైసీపి ఇప్పటికే కొంతమంది అభ్యర్ధులని వారి వారి నియోజకవర్గాలలో పట్టు పెంచుకోమని చెప్పేసింది.

అయితే టిడిపి అధినేత చంద్రబాబు మాత్రం ఇప్పటికే తనకి వచ్చిన సర్వే ల ఆధారంగా చాలా మంది ఎవరిని ఉంచాలి.ఎవరిని పక్కకి తప్పించాలో డిసైడ్ అయ్యారట.

అయితే ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచీ ఐదుగురు ఎమ్మెల్యేల పని తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది.
అయితే ఈ ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఈ సారి టికెట్స్ ఇచ్చే పరిస్థితి లేదని టాక్.

పార్టీ కార్యక్రమాలు గానీ, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కానీ వీరు బాగా వెనకబడటమే సిఎం అసంతృప్తికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.దానికితోడు వీరి వ్యవహారశైలిపై నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్లో పెరిగిపోయిన అసంతృప్తి.

టిడిపికి అతిపెద్ద ఓటు బ్యాంక్ అయిన బీసీ వర్గాలతో అంతర్గత కుమ్ములాటలు.అమాయకుల మీద తప్పుడు కేసులు పెట్టించి జైలుకి పంపిన ఘటనలు ఇలా అనేక అంశాలలో చుస్తే జనాల్లో వీరిపై సదభిప్రాయం లేదని సిఎం నిర్వహించిన సర్వేల్లో తేటతెల్లం అయ్యిందట.

ఒకానొక సమయంలో చంద్రబాబు సదరు ఎమ్మెల్యేలకి చూచాయిగా హెచ్చరించినా సరే వారు తమ పద్దతులు మార్చుకోక పోవడంతో బాబు వారికి టికెట్ ఇచ్చే విషయంలో మాత్రం ఏ మాత్రం సుముఖంగా లేరని తెలుస్తోంది.అయితే ఏపీ మొత్తం మీద 45 మంది ఎమ్మెల్యేలు బాబు టార్గెట్ లో ఉన్నారని అయితే టిడిపి కి కంచుకోట అయిన పశ్చిమలోనే సుమారు 5 మంది ఉన్నారని టాక్.

అయితే ఈ ఐదుగురి పేర్లు స్పష్టంగా తెలియకపోయినా జిల్లాలోని డెల్ట ప్రాంతం నుంచీ మొత్తం ముగ్గురు ఉన్నారని.మరి ఇద్దరు మెట్ట ప్రాంతాలకు చెందిన ఎంఎల్ఏలుగా ప్రచారం జరుగుతోంది.

అయితే మొదట్లో చితలపూడి ఎమ్మల్యే పీతల సుజాత పేరు వినిపించినా తాజాగా పీతల మీద బాబు కి వెళ్ళిన రిపోర్టు తో బాబు సంతృప్తి గానే ఉన్నారని తెలుస్తోంది.మరి ఎవరో ఆ ఎమ్మెల్యేలు అని అడిగితే కొంతకాలం ఆగండి తొందరెందుకు అంటోంది టిడిపి అధిష్టానం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube